Brahmamudi 13th March Episode: ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్ అంతరాత్మ ఓ మూలన కూర్చొని ఏడుస్తుంటాడు. ఈరోజు కాకుండా రేపైనా కళావతిని దగ్గరకు తీసుకుంటావని అనుకున్నా నా జీవితాన్ని నాశనం చేశావు కదరా? అంటుంది రాజ్ అంతరాత్మ. జీవితంలో అనుకున్నవి జరగవు జరిగేవి కోరుకోము అంటూ ఏవేవో చెబుతాడు రాజ్. రేపో మాపో మ్యారేజ్ డే కూడా వస్తుంది. ఇప్పుడేమో అమెరికా వెళ్లమని సలహా ఇస్తావు అంటాడు రాజ్ అంతరాత్మ. మనిషైతే కాస్త కళ పోషణ ఉండాలి. అందమైన పెళ్లాన్ని అమెరికా పంపించేసి నువ్వు ఎలా ఉంటవురా అంటుంది రాజ్ అంతరాత్మ నేనింతే ఇలాగే ఉంటాను అని వెళ్లిపోతాడు రాజ్
ఒక వైపు కనకం ఇంటికి వెళ్తారు ధాన్యలక్ష్మి, అనామికలు మీరు ఆడపిల్లలను కనింది మా ఇంటి మగపిల్లలను వల్లో వేసుకోవడానికే అని నిలదీస్తుంది. మీ అప్పు ఏం చేస్తుందో ఒకసారి బయటకు వచ్చి చూడండి తెలుస్తుంది. మాన మర్యాదలు లేని మీతో మాట్లాడాల్సి వస్తుంది అంటుంది ధాన్యలక్ష్మి. అయితే, మా ఆయన చేతిలో చేయి వేసి ఎందుకు తిరుగుతుంది మీ కూతురు మా మాఆయన మంచితనాన్ని ఆసరా చేసుకుని నాతో విడదీయాలని చూస్తుంది నీకూతురు అంటుంది అనామిక అప్పు నాన్నతో. అలాంటి బుద్ధి నాకూతురుకే ఉంటే నీతో పెళ్లి ఎందుకు చేస్తుందమ్మ అంటాడు అప్పు నాన్న. అలా చేస్తే మేం పెళ్లి చేసుకుంటాం అనుకున్నారా? ఆ ఇల్లు సత్రం అనుకున్నారా? అంటుంది ధాన్యలక్ష్మి
అంత ఆత్మాభిమానం ఉన్న ఆడదానివే అయితే, నీ కూతురు హద్దుల్లో పెట్టుకునేదానివి. ముసుగు వేసి ఒకదాన్ని ముసుగుతీసి మరోక దాన్ని మా ఇంటి కోడల్లను చూశారు అంటుంది. మీరెన్నైనా అనండి పడతాం. మాకూతుళ్లను మీ ఇంటి కోడల్లను చేశాం కాబట్టి కానీ, నా కూతుళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదంటాడు కనకం భర్త. మీరెందుకు ఇంత ఊగిపోతున్నారో అర్థం కావట్లేదు. కల్యాణ్ బాబు చదువుకున్నవాడు సంస్కారవంతుడు మా అప్పు కూడా పెళ్లైన వాడి వెంటపడే రకం కాదు అంటుంది కనకం. అంటే మేమే అపార్థం చేసుకుంటున్నాం అనుకుంటున్నారా? కల్యాణ్ వెంటపడుతూ నాతో విడగొట్టి నా భర్తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నీ కూతురు అంటుంది అనామిక.
అది ఈ జన్మకి జరగదు అంటుంది. ఇదిగో నాతోటి కోడలైనా కాస్త సంస్కారవంతంగా మాట్లాడుతుంది. మళ్లీ ఇద్దరూ కనిపించారంటే ఈరోజు ఇంట్లో జరిగింది రేపు రోడ్డుపై జరుగుతుంది జాగ్రత్త అంటుంది ధాన్యలక్ష్మి. నీకూతురు మీరు ఇంకోసారి మా అబ్బాయి జోలికి రానివ్వకండి అంటుంది ధాన్యలక్ష్మి అలాగే మీ కొడుకుకు కూడా జాగ్రత్తలు చెప్పుకో అంటుంది కనకం. ఏ బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు ఏం చేయడానికైనా తెగిస్తాను అంటుంది ధాన్యం వీధిలో పెడతాను అని కనకాన్ని బెదిరిస్తుంది. వీధిలో ఎవతి నాతో మాట్లాడుతుంది రా అంటుంది కనకం. ఛీ.. ఈ రౌడీలతో మనం మాట్లాడేంది అత్యయ్య ఇంకోసారి అప్పు కల్యాణ్ తో కనిపిస్తే నేనే చెప్పుతో కొడతా అంటుంది అనామిక. దీనికి కనకం ఏయ్.. నా కూతురు కూడా బలమైన బూట్లున్నాయి జాగ్రత్త అంటుంది కనకం. ఛీ ఛీ ఏం చేయాలో నాకు తెలుసుక నువ్వ రా అనామిక అని ధాన్యం అనామికను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది.
ఇక దుగ్గరాల వారి ఇంట్లో ఇందిరా దేవి కావ్యకు విడాకుల పత్రాలను ఇస్తుంది. ఏంటమ్మమ్మగారు ఇది మీ చేత్తో మీరే ఇస్తున్నారా? అంటే మీ ఉద్దేశం.. అంటుంది కావ్య.. మీ జంటను కలపడానికే ఈ విడాకుల పత్రం. భూగర్భంలో జలాన్ని బయటకు తీయడానికి కొన్నిసార్లు నాలుగు అడుగులు తవ్వితే చాలు కొన్నిసార్లు 400 అడుగులు తవ్వాల్సిందే అంటుంది ఇందిరాదేవి.వద్దమ్మమ్మ గారు వద్దు ఈ అస్త్రం నా కాపురాన్నే కూల్చేస్తుంది అంటుంది కావ్య. ఇది నటనే అమ్మ అంటుంది అమ్మమ్మ నాకు ఆ నటనే వస్తే ఇన్ని అవస్థలు అవసరం ఉండదు. జీవితాంతం ఉండాల్సింది అత్తవారిల్లు కష్టమైన సుఖఃమైన ఇంట్లోనే జరుగుతుంది. ఈ ప్రయోగం వికటిస్తే ఆయన మనస్సును నేను గెలవలేను అని ఏడుస్తుంది కావ్య. నాకు తెలుసుక నేను ఉన్నాను నాకు అన్ని తెలుసు అంటుంది అమ్మమ్మ. మనస్సులో నుంచి పుట్టుకొచ్చిన ప్రేమను ఏ బెదిరింపులు ఏం చేయలేవు. ఈ విడాకులు చూపిస్తే ఆయనకు అహం అడ్డొచ్చి సంతకం చేస్తే అంత ధైర్యం నాకు లేదు అంత గుండె నిబ్బరం నాకెప్పటికీ రాలేదు. భర్త ప్రేమకు దూరమై అటు పుట్టింటికి ఇటు అత్తారింటికి తలవంపులు తేలేను అంటుంది కావ్య. అలా జరగాలని నేను మాత్రం కోరుకుంటున్నానా? ఇన్నాళ్లు నిన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నా.. ఇంట్లో వాళ్తతో చెప్పకుండా జాగ్రత్తపడుతున్నాడు కదా? అంటుంది ఇందిరా దేవి. నిన్ను నీ పుట్టింటికి ఎందుకు పంపలేదు నీ వెనకాలే ఎందుకు వచ్చాడు, మీ ఇద్దరు కలిసి బయటకు పోతే మీ వెంట ఎందుకు పడుతున్నాడు ఎందకంటే అదంతా ప్రేమ ఆ ప్రేమను ఓ మాయ కమ్మేసింది. ఆ తెర తీస్తే వాడంత గొప్ప ప్రేమికుడు ఎవరూ ఉండరమ్మా అంటుంది అమ్మమ్మ. జీవితాంతాం ఒంటరి బతుకు ఇవ్వమని సంతకం చేయలేను.. తిరిగి ఆయన సంతకం చేస్తే నా బతుకు ఏమవుతుంది ఈ పనిచేయనందుకు నన్ను క్షమించండి అమ్మమ్మ అని కావ్య వెళ్లిపోతుంది. కావ్య ఒప్పుకోనందుకు మీకు కోపంగా ఉందా? అమ్మమ్మ అని భాస్కర్ అంటాడు, లేదు బాబు పొంగిపోతున్నాను ఇంతకన్నా గొప్ప భార్య రాజ్ ఎక్కడ దొరుకుతుంది నేను గర్వపడుతున్నాను అంటుంది అమ్మమ్మ.
ఇదీ చదవండి: Raja Saab: రాజా సాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. పాన్ ఇండియా కంటే పెద్ద ప్రాజెక్ట్! |
అప్పుడే కల్యాణ్ అప్పులు కనకం ఇంటికి చేరుకుంటారు బాగున్నారా? ఆంటీ అని కనకాన్ని అంటాడు కల్యాణ్. అమ్మ ఇదేందే ఇంటికి వచ్చిన మనిషితో ఇలాగేనా మాట్లాడేది అంటుంది. జరిగిందేదో జరిగింది మళ్లీ ఎందుకు మొదలుపెట్టవు అని అప్పును నిలదీస్తాడు అప్పు నాన్న. లోకం ఏమనుకుంటుంది నా కూతురు గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు అంటుంది కనకం, ఇవి మీ మాటలు కాదు ఈరోజు ఎందుకు ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు అంటాడు కల్యాణ్. మీకు పెళ్లైంది దాన్ని కాళ్ల మీద అది నిలబడటానికి కష్టపడతుంది మమ్మల్ని ఇలా వదిలేయండి మీకు దండం పెడతాం అంటుంది కనకం. ఏమైంది ఆంటీ మెమిద్దరం కలుసుకున్న విషయం ఎందుకు వచ్చింది అంటాడు అప్పుడే వదిలేయండి చిలికి చిలికి గాలివానలా మారడం ఎందుకు అంటాడు అప్పు నాన్న. మిమ్మల్ని ఎవరు ఇలా అన్నారో చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదల్ను అంటాడు కల్యాణ్.. చూడాలి కావ్య కూడా విడాకులపై సంతకం చేస్తుందా? లేదా? ఏం జరుగుతుందో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter