Brahmastram Day 1 Collections Worldwide: రణబీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లు గా రూపొందిన రాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు. కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. దక్షిణాదిలో ఈ సినిమాని రాజమౌళి ప్రమోట్ చేసి ఆయనే సమర్పిస్తూ విడుదల చేశారు. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ నాలుగు బడా ప్రొడక్షన్ సంస్థల భాగస్వామ్యంతో సుమారు 410 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించారు.
పురాణాలకు సంబంధించిన అస్త్రాల నేపథ్యంలో ఈ సినిమా మొత్తం సాగుతుంది. ఆ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రాన్ని సాధించే ఒక దుష్టశక్తికి హీరో ఎలా అడ్డుపడ్డాడు అనేది మొదటి భాగం సినిమా. సినిమా రెండో భాగం కూడా ఉంటుందని గతంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సుమారు ఐదేళ్ల క్రితమే ప్రారంభించిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా అద్భుతంగా ఉందని కొంతమంది కామెంట్ చేస్తుంటే అంతేమీ లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం సంచలనాలు సృష్టించింది అనే చెప్పాలి.
Brahmastram Day 1 Telugu States Collections: మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా కంటే ఎక్కువ వసూళ్లు సాధించడం గమనార్హం. అదేరోజు విడుదలైన శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా కేవలం 75 లక్షలే వసూలు చేయగా ఈ సినిమా సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక ప్రాంతాల వారీగా ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం. నైజాం: 1.85 కోట్లు, సీడెడ్: 42 లక్షలు, UA: 39 లక్షలు, ఈస్ట్ : 28 లక్షలు, వెస్ట్ : 18 లక్షలు, గుంటూరు : 27 లక్షలు, కృష్ణా : 15 లక్షలు, నెల్లూరు : 14 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.68 కోట్లు షేర్, 6.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఐదుకోట్లకు జరిగింది. ఐదున్నర కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే ఇంకా 1.82 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ అయినట్టే. ఇక తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా నిలిచినది. గతంలో ధూమ్ 3 4.70 కోట్ల కలెక్షన్స్ తో టాప్ ప్లేసులో ఉండగా ఇప్పుడు ఆ స్థానంలోకి ఈ సినిమా వచ్చి మొత్తం 6.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చెబుతున్నారు.
Also Read: Assistant Director Died: టాలీవుడ్లో విషాదం.. పూరి జగన్నాధ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి