Animal :రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న యానిమల్ సినిమా డిసెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాదులో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి మహేష్ బాబు, రాజమౌళి లాంటి వారు చీఫ్ గెస్ట్లుగా రావడం విశేషం.
కాగా వారిద్దరితో పాటు ఈ ఈవెంట్ కి మంత్రి మల్లారెడ్డి కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి
When that drunk #Mallareddy went off stage others were clapping but not #RanbirKapoor𓃵 . See the disappointment in his eyes. The south people should apologize. This is not how you treat your guests. Shame. pic.twitter.com/7OPdAt0wSQ
— Akib 🇧🇩 (@akib777) November 27, 2023
రణబీర్ కపూర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ మల్లారెడ్డి..“రణబీర్ కపూర్ వినండి.. రానున్న ఐదు సంవత్సరాలలో తెలుగువారు హాలీవుడ్.. బాలీవుడ్ ని ఏలుతారు. ఇక బాలీవుడ్..ముంబై పని అయ్యిపోయింది. బెంగళూరు కూడా మొత్తం ట్రాఫిక్ జామ్. కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చేయండి. హైదరాబాద్ దేశంలోని గొప్పదిగా ఎదుగుతుంది. మా దగ్గర సందీప్ వంగా, దిల్ రాజు, రాజమౌళి వంటి తెలివైన వారు ఉన్నారు. పుష్ప సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మీకు తెలుసు. ప్రస్తుతం తెలుగువారి అశ్వమేధ యాగం జరుగుతుంది” అంటూ షాపింగ్ కామెంట్స్ చేశారు మల్లారెడ్డి.
కాగా ఈ కామెంట్లపై బాలీవుడ్ వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేడుకగా హిందీ సినీ ప్రేమికులు మల్లారెడ్డి కామెంట్స్ పై విమర్శలు కురిపిస్తున్నారు. “సార్ మీరు భ్రమపడుతున్నారు. మీ తెలుగు స్టార్స్ బాలీవుడ్ ఫిలిమ్స్ లో విలన్స్ గా నటిస్తున్నారు. వారూ హీరోలు కాదు” అంటూ ట్వీట్ చేశారు. మరికొందరేమో మల్లారెడ్డి తాగేసి స్టేజి పైన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హిందీ సినిమా గొప్పదా తెలుగు సినిమా గొప్పదా అనే డిబేట్ సోషల్ మీడియాలో ఎంతో కాలంగా జరుగుతూ ఉండగా.. మల్లారెడ్డి కామెంట్స్ వాటికి మరింత ఆర్జ్యం పోసాయి.
Also Read: IPL 2024 Purse Details: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ, ఏ జట్టు పర్సులో ఎంత ఉందో తెలుసా.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook