Acharya Movie Ticket Prices Hiked In AP for 10 days: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించారు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను రెట్టింపు చేశాయి.
ఇప్పటికే ఆచార్య చిత్ర బృందం వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ భారీ హైప్ తీసుకొచ్చింది. చిత్ర యూనిట్ ప్రతి రోజు ఏదో ఒక అప్డేట్ను ఇస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను ఆచార్య వైపు తిప్పుకుంటున్నారు. తాజాగా ఆచార్య చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఆచార్య టికెట్ రేట్లను పెంచుకునేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 29 నుంచి పది రోజుల పాటు (మే 8) టికెట్ రేట్లను పెంచుకునే వెసలు బాటును కల్పించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఓ జీవోను కూడా ప్రకటించింది.
అయితే తెలంగాణలో మాదిరి కాకుండా అన్ని థియేటర్లకు ఓకే రేటును ఫిక్స్ చేసింది. మల్టీప్లెక్స్, ఏసీ థియేటర్ అనే వ్యత్యాసం లేకుండా.. పది రోజుల పాటు ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచుకునే అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆచార్య సినిమా షూటింగ్‌ను మారెడు మిల్లి అడవిల్లో కొంత భాగం షూటింగ్ చేశారు. దాంతో ఏపిలో చిత్రీకరణ చేయడం, నిర్మాణ వ్యయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్ సర్కార్.. టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఏపీలోని థియేటర్ ఓనర్స్ సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు సోమవారం ఆచార్య టికెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో వారం రోజులు అంటే.. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 30 వరకు పెంచుకునే వెసలుబాటును కల్పించింది. అంతేకాకుండా తెలంగాణాలో వారం రోజుల పాటు ఐదో షోకు కూడా పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్.
Also Read: RCB Playing XI vs RR: అనుజ్ రావత్ ఔట్.. విరాట్ కోహ్లీ డౌట్! రాజస్థాన్‌తో తలపడే బెంగళూరు జట్టిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.