Chiranjeevi Acharya : చిరంజీవి 'ఆచార్య' రన్‌ టైమ్‌‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. సినిమా నిడివి ఎంతంటే

Chiranjeevi Acharya Runtime:  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన 'ఆచార్య' మూవీ రన్ టైమ్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా రన్‌ టైమ్ ఎంతంటే... 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2022, 03:09 PM IST
  • ఆచార్య సినిమా నిడివిపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
  • సినిమా రన్ టైమ్‌ను లాక్ చేసిన చిత్ర యూనిట్
  • ఇంతకీ సినిమా నిడివి ఎంతో తెలుసా..
Chiranjeevi Acharya : చిరంజీవి 'ఆచార్య' రన్‌ టైమ్‌‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. సినిమా నిడివి ఎంతంటే

Chiranjeevi Acharya Runtime: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం రన్ టైమ్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. చిత్ర నిడివి 154 నిమిషాల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైమ్‌పై ఇప్పటికైతే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. 

ఆచార్య మూవీ రన్ టైమ్‌ 2 గంటల 46 నిమిషాలంటూ ఇదివరకు కొంత ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప... ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఆచార్య సినిమాలో మెగాస్టార్, రాంచరణ్ ఇద్దరు పవర్ఫుల్ రోల్స్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నక్సల్ నేపథ్యం, ధర్మస్థలి అనే అమ్మవారి ఆలయానికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగనుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇక ఈ సినిమాలో కాజల్ పాత్ర లేదని దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చేశాడు. నక్సల్ పాత్రకు ప్రేమ కథను జోడించడం సరికాదని భావించి... ఆ పాత్రను తొలగించినట్లు చెప్పారు. కాజల్ పాత్ర అవసరం లేదని మొదట చిరంజీవితో చెబితే... కథకు ఏది అవసరమో అది చేయమని చిరు చెప్పారన్నారు. కాజల్‌ను తప్పించడంతో ఈ సినిమాలో పూజా హెగ్డే మాత్రమే హీరోయిన్‌గా కనిపించనుంది. సినిమాలో తనికెళ్ల భరణి, సోనూ సూద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. చిరంజీవి, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Also Read: Weather Alert: తెలంగాణకు రాగల 3 రోజులు వర్ష సూచన... రాయలసీమలో తేలికపాటి వర్షాలు..

Also Read: World Malaria Day 2022: మలేరియా దినోత్సవం సందర్భంగా స్పెషల్‌ స్టోరీ..మలేరియా లక్షణాలు, నివారణ చర్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News