N.E.S.T. Movie: క్రైమ్ థ్రిల్లర్‌ N.E.S.T. మూవీకి అదిరిపోయే రెస్పాన్స్.. ఆ ట్విస్టులకు మైండ్ బ్లాక్..!

N.E.S.T. Movie Updates: క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన N.E.S.T. మూవీ టీమ్‌ను సినీ సెలబ్రిటీలు అభినందించారు. ప్రీమియర్ షోను చూసిన అనంతరం వారు మాట్లాడుతూ.. సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేస్తాయన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 29, 2024, 09:40 PM IST
N.E.S.T. Movie: క్రైమ్ థ్రిల్లర్‌ N.E.S.T. మూవీకి అదిరిపోయే రెస్పాన్స్.. ఆ ట్విస్టులకు మైండ్ బ్లాక్..!

N.E.S.T. Movie Updates: ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ జోన్ మూవీస్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్షణం క్షణం ఉత్కంఠగా సాగే సినిమాలను ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోపాటు ట్విస్టులు ఉంటే ఇక ఆ బొమ్మ హిట్ చేస్తున్నారు. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కిన N.E.S.T. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా ప్రదేశాలలో ఈ సినిమాను రూపొందించి ఇంగ్లీషులో తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగులో డమ్ చేసి మన ఆడియన్స్ కోసం విడుదల చేశారు. ఈ మూవీలో ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, పులి ధరణి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో శరత్ సింగం డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. నటుడు అరవింద్ కృష్ణతో సహా పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు ప్రీమియర్ షోను వేశారు.

Also Read: UPS Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. రేపే పెన్షన్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్..!

మూవీని చూసిన అనంతరం సెలబ్రిటీలు మాట్లాడుతూ.. N.E.S.T. మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా బాగుందని.. ప్రేక్షకులు కథలో లీనమై చూసేలా ఉందన్నారు. ఆడియన్స్ మీద కచ్చితంగా ప్రభావం చూపిస్తుందన్నారు. సినిమాలో ట్విస్టులు థ్రిల్‌కు గురి చేస్తాయని.. కొన్ని చోట్ల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయన్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉందని మెచ్చుకున్నారు. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో మూవీని తీశారని మేకర్స్‌ను మెచ్చుకున్నారు. సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచాయన్నారు.

సాంకేతిక సిబ్బంది:

==> స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: శరత్ సింగం
==> డీఓపీ: ఫణి శివరాజు, సుదీప్ తానేటి
==> నేపథ్య సంగీతం: భరద్వాజ్ వెంకట
==> ఎడిటింగ్: కార్తీక్ పల్లె
==> DI: గణేష్ కొమ్మరపు
==> PRO: సాయి సతీష్

Also Read: Kolkata doctor murder: అరగంటలో మూడు ఫోన్ కాల్స్.. కోర్టులో షాకింగ్ నిజాలు చెప్పిన కుటుంబీకులు.. ఎవరు చేశారో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x