Game Changer: గేమ్ చేంజెర్ టీమ్ కి రిలీఫ్.. మొత్తానికి ఆ ఇద్దరు అరెస్ట్…

Game Changer cyber crime case: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక సినిమాని నిర్మించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం దిల్ రాజు ఎన్నో అంచనాల మధ్య నిర్మిస్తున్న సినిమా రామ్ చరణ్ హీరోగా చేస్తున్న గేమ్ చేంజెర్. కాగా ఈ మధ్య ఈ సినిమా నుంచి భారీ బడ్జెట్ తో రూపొందిన ఒక పాట కొంతమంది వల్ల లీక్ అయ్యింది. మరి దీనిపైన దిల్ రాజు ఎలా స్పందించారు ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2023, 02:54 PM IST
Game Changer: గేమ్ చేంజెర్ టీమ్ కి రిలీఫ్.. మొత్తానికి ఆ ఇద్దరు అరెస్ట్…

Game Changer cyber crime case: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ చెంజర్. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా పై సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. పైగా దీనికి తోడు ఈ సినిమా డైరెక్టర్ శంకర్ కావడం తో ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దిల్ రాజు కూడా అందుకు తగ్గట్టు గానే ఈ సినిమా భారి స్థాయిలో నిర్మిస్తున్నారు.

అయితే దిల్ రాజు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా ని నిర్మిస్తున్న కూడా ఎక్కడో ఒక దగ్గర ఈ సినిమా కి సంభందించిన లీక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన మొదట్ లో షూటింగ్ లోని స్టిల్స్ బయటకి వచ్చేవి. ఇక ఇప్పుడేమో డైరెక్ట్ గా ఈ సినిమా కి సంభందించిన ఒక పాటనే బయటకి వచ్చింది. ఇక ఈ లీక్స్ బెడదని ఎలాగైనా ఆపాలని చెప్పి దిల్ రాజు సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసారు.

సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ని దర్యాప్తు చేసి పాట లీక్ కి కారణం అయిన ఇద్దరినీ అదుపులోకి తిసుకునట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇలా దిల్ రాజు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా పోలీసులు వెంటనే ఈ లీకులకు కారణమైన వారిని కనిపెట్టి అరెస్ట్ చేయగలిగారు. మరి ఇప్పటి నుంచైనా దిల్ రాజు మరియు మూవీ టీం జాగ్రత్తగా ఉంటూ సినిమా కంటెంట్ ని కాపాడుకుంటారు ఏమో వేచి చూడాలి. 

ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కి సంభందించిన మొదటి పాట దీపావళి సంధర్బంగా రిలీజ్ కాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం లో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వీరితో పాటు అంజలి, సముధ్రఖని, నవీన్ చంద్ర, సునీల్, ఎస్.జే. సూర్య వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న శంకర్ అతి త్వరలో గేమ్ చెంజర్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News