Deadpool and Wolverine WW Collections: మైండ్ బ్లాంక్ చేస్తోన్న డెడ్ పూల్ వాల్వరిన్ తెలుగు వసూళ్లు.. కల్కికి గట్టి పోటీ ఇస్తున్న హాలీవుడ్ మూవీ..

Deadpool and Wolverine WW Collections: గత కొన్నేళ్లుగా మంచి కంటెంట్ ఉంటే.. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ చిత్రాలను వివిధ ప్రాంతీయ భాషల్లో అనువాదం చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ కోవలో వచ్చిన ‘డెడ్ పూల్ అండ్ వాల్వరిన్’ చిత్రం ఇపుడు హాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 29, 2024, 01:10 PM IST
Deadpool and Wolverine WW Collections: మైండ్ బ్లాంక్ చేస్తోన్న డెడ్ పూల్ వాల్వరిన్ తెలుగు వసూళ్లు.. కల్కికి గట్టి పోటీ ఇస్తున్న హాలీవుడ్ మూవీ..

Deadpool and Wolverine WW Collections: హాలీవుడ్ చిత్రం ‘డెడ్ పూల్ అండ్ వాల్వరిన్’ మూవీ ఇపుడు గ్లోబ్లల్ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.  ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను సైతం అలరిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గ్లోబల్ లెవల్లో దాదాపు రూ. 3670 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఇంకా రన్ అవుతూనే ఉంది. ఈ సినిమా తెలుగు నాట కూడా థియేటర్స్ లో సందడి చేస్తోంది.

భారీ అంచనాల మధ్య జూలై 26న విడుదలైన ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ వారు భారీ ఎత్తున నిర్మించారు. ర‌య‌న్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. దాదాపు మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 3670 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక భారత దేశంలో కూడా డెడ్ పూల్ హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మార్వెల్ అభిమానులకు తగ్గట్టు ఈ సినిమా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చింది.

అంతేకాదు తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో ఇపుడు యూత్ లో పాతుపోయిన టైమ్లీ డైలాగ్స్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. డెడ్ పూల్ చేసిన నటులు రయన్ రెనాల్డ్స్ పలికిన తెలుగు డైలాగులకు మంచి అప్లాజ్ వస్తోంది. అంతేకాదు యాక్షన్ సినిమాలో కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు  తెలుగు ఆడియన్స్. తెలుగులో కూడా ఈ సినిమా మంచి ఆదరణతో కల్కి మూవీకి గట్టి పోటీ ఇస్తూ తెలుగు బాక్సాఫీస్ ను రఫ్పాడిస్తోంది.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News