Devara Loss: విడుదలకు ముందే దేవర సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలు..ఏకంగా అన్ని లక్షలు..!

Loss for Devara producers: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర.. సినిమాపై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా విడుదలకి ఇక కేవలం రెండు రోజులే ఉండగా.. ఇప్పటికే ఈ చిత్రం టికెట్స్ బుక్ మై షో లో భారీగా బుక్ అయిపోయి హౌస్ ఫుల్ బోర్డ్స  పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ సినిమా గురించి అభిమానుల్లో ఏదన్నా ఒక అసంతృప్తి మిగిలింది అంటే.. అది కేవలం ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే. అయితే ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఒక హోటల్ కి భారీగా నష్టం జరిగింది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 24, 2024, 07:00 PM IST
Devara Loss: విడుదలకు ముందే దేవర సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలు..ఏకంగా అన్ని లక్షలు..!

Devara Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులకు భారీగా అంచనాలు ఉన్నాయి. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ సేమ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ లెవెల్ లో క్లిక్ అవడంతో.. ప్రపంచం మొత్తం సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలవుతుండగా.. ఇప్పుడే ఈ చిత్ర టికెట్స్ బుక్ మై షో లో విడుదలై.. హౌస్ ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ థియేటర్స్ లో.. ఈ సినిమా టికెట్స్ రిలీజ్ చేసిన రెండు నిమిషాలకి ఫుల్ అయిపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. మరోపక్క ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా కూడా చిత్ర యూనిట్ వెనకాడకుండా.. తెగ జోరుగా జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో ఘనంగా జరుగుతుందని.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇక అనుకున్నట్టే సినిమా యూనిట్ ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ మధ్యనే సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్ లోని నోవోటెల్ హోటల్లో జరపడానికి అన్ని సిద్ధపరిచారు.

కానీ దురదృష్టం కొద్దీ ఆరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. అనుకున్న దానికంటే.. ఎక్కువమంది అభిమానులు అక్కడికి రావడంతో.. అక్కడున్న పోలీసులు వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తద్వారా అక్కడ అభిమానులు కాస్త లోపలకు దూసుకుపోయే సమయంలో చిన్న మినీ యుద్ధం సృష్టించేశారు. నోవోటల్ లో ఉన్న ఎస్కలేటర్ గ్లాసులతో సహా వీరి విధ్వంసం వల్ల పగిలిపోయాయి. 

5500 మంది కెపాసిటీ మాత్రమే ఉన్న ఈ ప్రదేశానికి ఏకంగా 35,000 మంది వచ్చి పడ్డారు. ఇక ఎస్కలేటర్ గ్లాసులతో పాటు అక్కడ ఉన్న డోరులు కుర్చీలు కూడా డామేజ్ అయ్యాయి. ఇక ఆరోజు జరిగిన రచ్చ వల్ల.. దాదాపు అక్కడ ఉన్న 40 రూముల బుకింగ్లు కూడా ఆగిపోయాయంట. కేవలం రూమ్ బుకింగ్స్ కే 10 లక్షల నష్టం జరిగిందట. ఈ క్రమంలో నోవోటల్ వాళ్లు దేవరా సినిమా యూనిట్ని 33 లక్షల నష్టపరిహారం కోరుతున్నట్లు వినికిడి. మరి సినిమా మేకర్స్ సినిమాకి ముందే ఈ నష్టాన్ని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.

Read more: Pawan kalyan vs prakash raj: సనాతన ధర్మం జోలికి రావోద్దు.. ఇంద్రకీలాద్రి సాక్షిగా మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News