Adhi Da Saaru Lyrical: స:కుటుంబానాం నుండి అది దా సారు లిరికల్ వీడియో విడుదల చేసిన దిల్ రాజు

Dil Raju: మేఘా ఆకాష్, రామ్ కిరణ్ నటించిన స:కుటుంబానాం సినిమా నుంచి అది దా సారు లిరికల్ వీడియోను.. నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. కుటుంబ నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమా పాటను.. సంగీత ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. ఇక ఈ పాట గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 25, 2024, 04:10 PM IST
Adhi Da Saaru Lyrical: స:కుటుంబానాం నుండి అది దా సారు లిరికల్ వీడియో విడుదల చేసిన దిల్ రాజు

S:Kutumbanam: ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు తాజాగా స:కుటుంబానాం చిత్రానికి చెందిన అది దా సారు లిరికల్ వీడియోను విడుదల చేశారు. రామ్ కిరణ్ హీరోగా, మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తున్న.. ఈ సినిమా షూటింగ్ సెలవేగంగా జరుగుతోంది. కుటుంబ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే.. నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది.  

ఈ క్రమంలో ఈ సినిమా నుంచి విడుదలైన పాట అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రత్యేకంగా ఈ పాటలోని లిరిక్స్ సంగీత ప్రియుల.. హృదయాలను కదిలిస్తున్నాయి. వీడియోలో మేఘా ఆకాష్ కొత్తగా కనిపించడంతో..ఈ పాట.. తెలుగు సంగీత అభిమానుల్ని మరింత ఆకర్షిస్తోంది. 

ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన స్టెప్స్.. ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలబడి ఉన్నాయి అని చెప్పారు చిత్ర యూనిట్. సంగీతం, డాన్స్, లిరిక్స్ అన్నీ కలగలిపి ఈ పాట.. ప్రేక్షకులని ఫిదా చేస్తోంది అనడంలో..అతిశయోక్తి లేదు.  అది దా సారు పాటకు.. భాను మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ ట్యూన్ కి.. బీట్ కి తగ్గట్టుగా సెట్ అయ్యాయి అంటున్నారు అందరూ. మొత్తం పైన నెటిజన్లు ఈ పాటను విపరీతంగా ప్రశంసిస్తున్నారు.  

ఇక ఈ పాట విడుదలతో స:కుటుంబానాం సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఎంతలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.  

స:కుటుంబానాం చిత్రానికి ఉదయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. హెచ్.ఎన్.జి. సినిమాస్ బ్యానర్‌పై హెచ్. మహాదేవ గౌడ, హెచ్. నగరత్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ నేపథ్యంతో రానున్న ఈ సినిమా.. ఇప్పటికే టైటిల్ ద్వారా అంచనాలు పెంచింది.  
ఈ చిత్రంలో రామ్ కిరణ్, మేఘా ఆకాష్ తో పాటు శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, తాగుబోతు రమేష్ వంటి వారు నటిస్తున్నారు. అలాగే, సినిమా చిత్రీకరణలో.. ఇప్పుడు వచ్చిన ప్రమోషనల్ వీడియోలు చూస్తూ ఉంటే.. అగ్రతారాగణం, సాంకేతిక బృందం సమిష్టి కృషి కనిపిస్తోంది.

Also Read: Jr NTR Fan: జూనియర్‌ ఎన్టీఆర్‌పై విమర్శలపై యూటర్న్‌.. కౌశిక్‌ తల్లి వివరణ ఇదే!

Also Read: Dil Raju: సంధ్య థియేటర్‌ బాధిత రేవతి భర్తకు దిల్‌ రాజు బంపర్‌ ఆఫర్‌.. సినిమా ఛాన్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News