OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

OTT Releases: ధియేటర్ కంటే ఓటీటీలకే క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన కంటెంట్ నచ్చినట్టుగా నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటమే ఇందుకు కారణం. అందుకే కొత్త కొత్త సినిమాలు సైతం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 10, 2024, 03:49 PM IST
OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

OTT Releases: కరోనా కాలం నుంచి దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన సమయంంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటంతో ఓటీటీలకు క్రేజ్ అధికంగా ఉంటోంది. ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో కొత్త సినిమాలు కూడా ఉన్నాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

జూన్ 10వ తేదీన ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ హిన్ అండ్ సిక్స్ అదర్ లాంగ్స్ సిరీస్ సీజన్ 4, ది కలర్ ఆఫ్ విక్టరీ వెబ్‌సిరీస్, ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ ఇంగ్లీషు సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక జూన్ 12వ తేదీన నాట్ డెడ్ యెట్ సీజన్ 2 స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. 

అమెజాన్ ప్రైమ్..

జూన్ 10వ తేదీన గ్రౌండ్ తెలుగు సినిమా, జూన్ 13వ తేదీన ద బాయ్స్ సీజన్ 4 తెలుగు డబ్బింగ్ సిరీస్, స్టార్ తమిళ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. 

నెట్‌ఫ్లిక్స్ ..

జూన్ 12వ తేదీన కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డెన్ టచ్ సీజన్ 2 ఇంగ్లీష్ వెబ్‌సిరీస్, జూన్ 13వ తేదీన డాక్టర్ క్లైమాక్స్ థాయ్ సిరీస్, జూన్ 14వ తేదీన విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, జూన్ 14వ తేదీన మహారాజ్ హిందీ సినిమా, నాక్ ఎట్ ది క్యాబిన్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్, స్వీట్ టూత్ సీజన్ 3, పర్ఫెక్ట్ మ్యాచ్ ఇంగ్లీషు వెబ్‌సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానున్నాయి. 

ఆహా..

బూమర్ అంకుల్ తమిళ సినిమా, మిరల్ తెలుగు సినిమాతో పాటు జూన్ 12వ తేదీన పారిజాతపర్వం తెలుగు సినిమా, జూన్ 14వ తేదీన కురంగు పెడల్ తమిళ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవనున్నాయి. 

జీ 5..

జూన్ 14వ తేదీన లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ హిందీ సినిమా, పరువు తెలుగు సినిమా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. 

Also read: Jio AirFiber Plans: జియో ఎయిర్ ఫైబర్ 599 ప్లాన్‌తో ఈ 15 ఓటీటీలు ఉచితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News