Director K Viswanath Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది, గత నెలలో పలువురు సినీ ప్రముఖులు టాలీవుడ్ కు దూరమవుగా ఇప్పుడు తాజాగా 50 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కే విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం రీత్యా అనారోగ్యంతో కే విశ్వనాథ్ బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు.
ఆయన వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కే విశ్వనాధ్ మృతిచెందగా ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం నగర్ లోని నివాసానికి తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఆయన అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్వహిస్తారు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కే విశ్వనాద్ కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉండగా వారి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు.
కే విశ్వనాథ్ ను సినీ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం సహా అనేక అవార్డులు రివార్డులు ఆయనను వరించాయి. ఆయన తెరకెక్కించి సూపర్ హిట్ గా నిలిచిన శంకరాభరణం మూవీ విడుదలై నేటికి 43 ఏళ్లు పూర్తి కాగా అదే రోజు ఆయన కన్నుమూయడం ఆయన అభిమానులకు షాక్ కలిగిస్తోంది. సౌండ్ రికార్డిస్టుగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయన సహాయ దర్శకుడిగా మారి.. ఆ తర్వాత దర్శకుడిగా మారి సుమారు 50కి పైగా హిట్ సినిమాలను తెరకెక్కించాడు.
మెగా ఫోన్ పట్టుకుని నటింపచేయడమే కాదు, కెమెరా ముందు నటుడిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఆత్మ గౌరవం కాగా ఆయన మొదటి సినిమాకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు లభించింది. ఆ తర్వాత శంకరాభరణం సినిమాతో ఆయన దశ తిరిగిపోయింది.
ఘన విజయం అందుకున్న ఈ సినిమా జాతీయ పురస్కారం సొంతం చేసుకోగా విశ్వనాథ్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిన చిత్రాలలో సిరివెన్నెల కూడా ఒకటిగా నిలిచింది. అలాగే ఆయన తన కెరీర్లో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, అపద్భాంధవుడు, శుభసంకల్పం వంటి అద్భుతమైన చిత్రాలను రూపొందించి కళాతపస్విగా పేరు తెచ్చుకున్నారు.
Also Read: Rajinikanth Warns Fan: బాలూ.. నా వెంట పడొద్దు.. అభిమానికి గట్టి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.