Ram Movie: రామ్, ఆది పినిశెట్టితో చేయాలనుకున్నా.. థియేటర్లో ఆ సీన్స్‌కు గూస్‌బంప్స్: డైరెక్టర్ మిహిరాం వైనతేయ

Director Mihiram Vainatheya: దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీ జనవరి 26న ఆడియన్స్ ముందుకు వచ్చింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండంతో మూవీ మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ మిహిరాం వైనతేయ మీడియాతో మాట్లాడారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 08:00 PM IST
Ram Movie: రామ్, ఆది పినిశెట్టితో చేయాలనుకున్నా.. థియేటర్లో ఆ సీన్స్‌కు గూస్‌బంప్స్: డైరెక్టర్ మిహిరాం వైనతేయ

Director Mihiram Vainatheya On RAM Rapid Action Mission: రిపబ్లిక్ డే సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం అవ్వగా.. మిహిరామ్ వైనతేయ దర్శకత్వం వహించారు. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి దీపికాంజలి వడ్లమాని నిర్మించారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో డైరెక్టర్ మిహిరాం వైనతేయ మీడియాతో ముచ్చటించారు. రామ్ సినిమాపై ఆడియన్స్ రెస్పాన్స్ గురించి స్పందించారు.

తనకు చిన్నతనం నుంచి కూడా సినిమాలు అంటే ఇష్టం ఉండేదని.. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోందన్నారు. అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా చాలా మంది వద్ద పని చేశానని.. ముత్యాల సుబ్బయ్య, తేజ, కృష్ణవంశీ ఇలా అందరి వద్ద తాను వర్క్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. సొంతంగా కథలు, పాటలు  రాయడం మొదలు పెట్టానని.. 'రామ్' అనే స్టోరీని ముందుగా హీరో రామ్‌ పోతినేనిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నట్లు చెప్పారు. ఆ తరువాత ఆది పినిశెట్టితో తీయాలని అనుకున్నానని.. అయితే హీరోగా చేసిన సూర్య తనకు ఎప్పటి నుంచో పరిచయం కావడంతో ఓ సారి ఈ కథ చెప్పానని తెలిపారు. అల్లరి చిల్లరగా తిరిగే ఒక కుర్రాడు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అవ్వడం అనే కాన్సెప్ట్ నచ్చడంతో తానే చేస్తానని సూర్య చెప్పాడని.. తాను ఒకే చెప్పానని అన్నారు.

క్యాస్టింగ్ ఫైనలైజ్ చేసిన తరువాత సాయి కుమార్ డేట్స్ కోసం కొద్దిరోజులు ఆగాల్సి వచ్చిందని.. ఆయన పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు మిహిరాం. సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, భాను చందర్ వంటి సీనియర్లతో కలిసి వర్క్ చేయడంతో చాలా నేర్చుకున్నానని చెప్పారు. ధన్య బాలకృష్ణ తమకు ముందుకు నుంచి ఎంతో సపోర్ట్ చేశారని.. ఆమె చేసిన ఓ సీన్‌కు ప్రేక్షకులు కంటతడి పెడుతున్నారని అన్నారు. హీరో సూర్య కొన్ని సీన్లలో తన నటనతో ఆశ్చర్యపరిచాడని పేర్కొన్నారు.

రామ్ నిర్మాణ సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చాయని.. ఈ మూవీ కోసం తాము రెమ్యూనరేషన్ కూడా అంతగా తీసుకోలేదన్నారు. ప్రొడ్యూసర్‌కు భారం కాకూడదని.. సినిమా బాగా రావాలని తపనతో పనిచేశామన్నారు. షూటింగ్ స్పాట్‌లో ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా పనిచేశామన్నారు. రామ్ సినిమాకు అన్ని పాటలు రాసి.. మ్యూజిక్ కూడా అందించానని తెలిపారు. డైరెక్షన్, డైలాగ్స్‌తోపాటు మ్యూజిక్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రీ క్లైమాక్స్ సీన్స్‌కు ఆడియన్స్‌కు గూస్ బంప్స్ వస్తాయని.. ఆ సీన్లకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌ చూడాలని కోరారు. 

Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News