Teja on Uday Kiran: చేయాల్సిందంతా చేసి కాళ్లు పట్టుకోవడానికి వచ్చాడు.. క్షమించనని చెప్పా!

Teja Comments on Uday Kiran: దర్శకుడు తేజ​ ఉదయ్ కిరణ్ గురించి ఒక కీలకమైన విషయం బయటపెట్టారు, ఆ వివరాలు ఎక్స్ క్లూజివ్ గా మీకు అందిస్తోంది జీ తెలుగు న్యూస్ 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 5, 2022, 09:40 PM IST
Teja on Uday Kiran: చేయాల్సిందంతా చేసి కాళ్లు పట్టుకోవడానికి వచ్చాడు.. క్షమించనని చెప్పా!

Director Teja Comments on Uday Kiran: దర్శకుడు తేజ ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ సినిమాలు చేసి ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. అనేకమంది కొత్తవారిని పరిచయం చేస్తూ ఆయన చేసే సినిమాలు చాలా మంది కొత్తవారికి లైఫ్ ఇస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఉదయ్ కిరణ్ కి కూడా మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. అలా ఆయన చేసిన చిత్రం సినిమా సూపర్ కావడంతో పాటు తరువాత చేసిన నువ్వు నేను సినిమా కూడా సూపర్ హిట్ పడటంతో ఆ తర్వాత ఉదయ్ కిరణ్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

అలా అనేక సూపర్ హిట్ సినిమాల్లో ఉదయ్ కిరణ్ కూడా భాగమయ్యారు. అయితే ఒకానొక దశలో ఉదయ్ కిరణ్ కి కూడా ఫ్లాప్ సినిమాలు పడుతూ ఉండడంతో ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలే కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కూడా తేజ మరోసారి ఉదయ్ ను ఆదుకున్నారు. ఉదయ్ కిరణ్ కి ఔనన్నా కాదన్నా అనే సినిమాలో అవకాశం ఇచ్చి ఆదుకున్నారు. అయితే అప్పటికే ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ లలో ఉన్న సమయంలో తన ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవాడు కాదని ఆ సమయంలో ఉదయ్ కిరణ్ మీద చాలా కోపం వచ్చిందని తేజ చెప్పుకొచ్చారు.

ఔనన్నా కాదన్నా సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఒకరోజు ఉదయ్ కిరణ్ తన వద్దకు వచ్చి నేను అలా చేసినా మీరు సినిమా ఇవ్వడం చాలా గొప్ప విషయమని ఒకసారి మీ కాళ్లు పట్టుకుంటాను క్షమించమని కోరాడట. అయితే తేజ మాత్రం అందుకు ఒప్పుకోకుండా నీకు సినిమా అవకాశం ఇస్తాను కానీ నా కాళ్లు పట్టుకునే అవకాశం మాత్రం ఇవ్వనని అన్నారట.

ఇప్పుడు నేను క్షమిస్తే అది ఇక్కడితో అయిపోతుందని నువ్వు మరో తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ నేను అలా చేయదలచుకోలేదు అని తేజ చెప్పుకొచ్చారట. నువ్వు అలాగే ఉండు నేను ఇలాగే ఉంటాను మనం సినిమా చేద్దాం హిట్ కొడదామని ఉదయ్ కిరణ్ కి చెప్పానని తాజాగా జీ తెలుగు న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ చెప్పుకొచ్చారు.

Also Read: Uday Kiran Death Secret: ఉదయ్ కిరణ్ అందుకే చనిపోయాడు.. అంతా చెప్పాడని కీలక విషయం బయటపెట్టిన తేజ!

Also Read: Director Teja - Suman Shetty: కృతజ్ఞత అంటే ఇది.. ఏకంగా రూమ్ సిద్ధం చేశాడట.. ఆసక్తికర విషయం బయట పెట్టిన తేజ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News