Samantha Ruthprabhu Skin Issues: ఆ వ్యాధితో ఇబ్బంది.. చికిత్స కోసం అమెరికాకు సమంతా?

Samantha Ruthprabhu Going to USA For Skin Treatment: సమంత చికిత్స తీసుకోవడం కోసం అమెరికా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 18, 2022, 05:14 PM IST
Samantha Ruthprabhu Skin Issues: ఆ వ్యాధితో ఇబ్బంది.. చికిత్స కోసం అమెరికాకు సమంతా?

Samantha Ruthprabhu Going to USA For Skin Treatment: గత కొన్నాళ్లుగా సమంత అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా జూలై నెల చివరిలో షూటింగ్ జరిగింది.  ఆ తర్వాత సమంత సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ కనిపించకపోవడంతో ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ అనేక రకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి.

కొంతమంది అయితే ఆమె గర్భసంచి కూడా తీయించేసుకుంటుందంటూ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే సమంత మేనేజర్ తన మీదకు వచ్చి ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకాలేదని ఆమె పర్ఫెక్ట్ గా ఉన్నారని త్వరలోనే మీడియా ముందుకు కూడా వచ్చే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా సమంత గురించి మరో ప్రచారం మొదలైంది. అదేమిటంటే సమంత అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఆమె అనారోగ్యంతో బాధపడడం లేదు కానీ ఒక రకమైన చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అమెరికా వెళ్లి ఆమె ఒక హై ప్రొఫైల్ హాస్పిటల్ లో చర్మ చికిత్స చేయించుకోబోతున్నారని తెలుస్తోంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయించుకొని ఆ తరువాత ఆమె ఇండియా తిరిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఆమె ఎప్పుడు అమెరికా వెళుతున్నారు? ఎప్పుడు తిరిగి వస్తారు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అదే విధంగా సమంత తాను చేస్తున్న సినిమాల నిర్మాతలకు కూడా దీని గురించి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నానని వారికి సమాచారం ఇచ్చి ఇంట్లోనే ఉంటున్నారని, బహుశా ఈ చర్మ సమస్యతోనే ఆమె ఇబ్బంది పడుతున్నారు ఏమో అనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ప్రస్తుతానికి సమంత ఖుషీ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

ఆ సినిమాలో ఆమె ఆత్మగా నటిస్తోందనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వెలవడలేదు. ఇక ఆమె నటించిన యశోద, శాకుంతలం వంటి సినిమాలు షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాల ద్వారా సమంత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే సమంత ఆరోగ్యం గురించి ఆమె స్వయంగా క్లారిటీ ఇస్తే తప్ప ఇలాంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదని చెప్పొచ్చు.

Also Read: Powlen Jessica Suicide: లవ్ ఫెయిల్.. సూసైడ్ చేసుకుని తమిళ హీరోయిన్ మృతి!

Also Read: Kriti Sanon and Prabhas dating: పెదనాన్న చనిపోయిన బాధలో ప్రభాస్.. కృతితో ప్రేమాయణమంటున్న బాలీవుడ్ మీడియా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News