Captain Vijaykanth: తమిళ యాక్షన్ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనుకు కరోనా పాసిటివ్ రావడంతో చెన్నైలో మియోట్ ఆసుపత్రిలో చేర్చారు. శ్వాసకోశ సమస్యల కారణంగా విజయకాంత్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే విజయ్ కాంత్ పరిస్థితి విషమిండంతో ఈరోజు తెల్లవారి జామున ఆయన కన్నుమూశారాని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ వార్త బయటకు రావడానికి ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీతో పాటు, రాజకీయ శ్రేణుల్లో విశాదం నెలకొంది. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సినీ పెద్దలు.. అలానే సినీ ప్రేక్షకులు విజయకాంత్ కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా హీరో విజయ్ కాంత్ 40 ఏళ్ల సినీ రంగం, 20 ఏళ్లకు పైగా రాజకీయ రంగంలో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. తమిళ సినిమాల్లో కెప్టెన్‌గా అగ్రస్థానాన్ని చేరుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ కాంత్.. రాజకీయాల్లో మాత్రం ఆశించినంతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ ఆయన దగ్గరికి పోయి ఏమీ అడిగినా చేసే వ్యక్తి అని.. జనాల హృదయాల్లో మాత్రం కెప్టెన్‌గా చిరకాలం స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇక ఆయన ఈరోజు తుది శ్వాస విడవదంతో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాను అభిమానులు. ఇందులో ముఖ్యంగా విజయ్ కాంత్ కి ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ రోజా భర్త కి ఉన్న సంబంధం ఏమిటి అనే వార్త తెగ వైరల్ అవుతుంది.
80, 90ల్లో సూపర్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ కాంత్ వరుస సినిమాలతో హిట్స్ కొట్టారు. ముఖ్యంగా విజయ్‌కాంత్ ఎక్కువగా పోలీస్ పాత్రల్లో, లీడర్ పాత్రల్లో నటించారు. కాగా విజయ్ కాంత్ నటించిన చిత్రాలలో 1991లో వచ్చిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ అనే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయన్ని స్టార్ హీరోల్లో ఒకరిగా చేసింది. అయితే ఈ సినిమాని రోజా భర్త RK సెల్వమణి తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమా వల్లే విజయ్ కాంత్ కి కెప్టెన్ అనే బిరుదు కూడా వచ్చింది. మొత్తానికి ఇలా ఆయన బిరుదు కెప్టెన్ రావడానికి కారణం కూడా రోజా భర్త సెల్వమణి. అంతేకాదు మరో విశేషం ఏమిటి అంటే ఈ కెప్టెన్ ప్రభాకరన్ విజయ్ కాంత్ నటించిన వండవ చిత్రం.
ఇలా విజయకాంత్ కెరియర్ లో ఎంతో ప్రత్యేక స్థానంలో ఉన్న ఈ సినిమాని రోజా భర్త RK సెల్వమణి తెరకెక్కించారు. అంతేకాదు అంతకు ముందే విజయకాంత్ సెల్వమణి దర్శకత్వంలో పూలన్ విసరణై అనే చిత్రంలో కూడా నటించారు.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook