Kulasekhar Failure Story: కులశేఖర్ ఫెల్యూర్ స్టోరీ..ఎందుకు జైలు కెళ్లాడు.. హృదయాన్ని మెలిపెట్టే కన్నీటీ గాథ..

Kulasekhar Failure Story: కులశేఖర్ ఈ పాటల రచయత పేరు వినగానే..ఆయన కలం నుంచి జాలు వారిన కొన్ని మధుర గీతాలు మన మనసుల్ని హాయి గొలుపుతాయి. . మరికొన్ని పాటలు మనోలిని నిరాశ, నిస్పృహలను పారద్రోలుతాయి.అలా తనువు, మనసును ఆహ్లాద పరిచే ఎన్నో అద్భుత సాహిత్య కుసుమాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. ఎన్నో అద్బుత పాటలను అందించిన కులశేఖర్.. ఈ రోజు అనాథల చనిపోవడం సిన అభిమానులను కలిచివేసిందనే చెప్పాలి. సినీ సాహిత్యంలో ఉన్నత శిఖరాలను అందుకున్న కులశేఖర్.. ఎందుకు తన జీవిత చరమాంకంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. అతని ఫెల్యూర్ స్టోరీ ఏంటో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 26, 2024, 04:56 PM IST
 Kulasekhar Failure Story: కులశేఖర్ ఫెల్యూర్ స్టోరీ..ఎందుకు జైలు కెళ్లాడు.. హృదయాన్ని మెలిపెట్టే కన్నీటీ గాథ..

Kulasekhar Failure Story: అది 2000 సంవత్సరం.. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చిత్రం’ సినిమాతో పాటల రచయతగా తన ప్రస్థానం మొదలు పెట్టారు కులశేఖర్. అందులో అన్ని పాటలు ప్రేక్షకులను రంజింప చేశాయి. మనసులను మెలిపెట్టాయి కూడా. అందులో ఊహాల పల్లకిలో ఊరేగించనా.. ఆశల పల్లకిలో అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఎప్పటికీ మరిచిపోలేరనే చెప్పాలి. సుమారు ఆయన కెరీర్ లో దాదాపు 100 పైగా విజయవంతమైన చిత్రాల్లో ఎన్నో అత్యద్బుతమైన గీతాలను రాసారు.

ఈ మధ్య కాలంలో వచ్చే పాటల రచయతల్లా కాకుండా.. ఆయన రాసిన ప్రతి పాటలో అద్భుతమైన సాహిత్యం ఉండేది. ముఖ్యంగా ఆర్పీ పట్నాయక్, తేజ కాంబినేషన్ లో ఈయన రాసిన పాటలు అప్పట్లో పెద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాయి. నువ్వు నేను సినిమాలో ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ పాటతో పాటు నా గుండెలో నీ ఉండిపోవా అనే సాంగ్ సహా అన్ని పాటలు అప్పటి యువతను ఉర్రూత లూగించాయి.  ఇక చిత్రం, నువ్వు నేను  తర్వాత జయం మూవీలో ‘రాను రాను అంటుంది చిన్నదో’ పాట తెలుగు పాటల్లో ఎవర్ గ్రీన్ ఫోక్ సాంగ్ గా నిలిచిపోయింది. అటు వసంతంలో అమ్మో అమ్మాయేనా సాంగ్ చక్కటి మెలోడిగా నిలిచిపోయింది. అటు  ఘర్షణలో ‘చెలియా చెలియా’, ఏ చిలిపి కళ్లలోనా కలవో అంటూ ఈయన అందించిన సాహిత్యం ఇప్పటికీ శ్రోతలను మెమరిచి పోయేలా చేస్తోంది. మొత్తంగా చిత్ర పరిశ్రమలో తన సాంగ్స్ తో ఓ ట్రెండ్ సెట్ చేసిన ఈయన చివరకు ఎవరిలేని అనాథలా కన్నుమూయడం బాధాకరం.  

కులశేఖర్ విషయానికొస్తే.. ఈయన 1971లో ఆగష్టు 15న సింహాచలంలో సాంప్రదాయ బ్రాహ్మణ శ్రీ వైష్ణవ కుటుంబంలో జన్మించారు. ఈనాడు పత్రికలో జర్నలిస్టుగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత అదే సంస్థ నిర్మించిన ‘చిత్రం’తో విచిత్రంగా గీత రచయతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ముఖ్యంగా తేజ, ఆర్పీ పట్నాయక్ లు లైమ్ లైట్ లో ఉన్నంత వరకు ఈయనకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఈయన చేసిన కొన్ని తప్పులతో పాటు ఓ హీరోయిన్ వల్ల ఈయన కెరీర్ కు పెద్ద దెబ్బేసిందనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సరైన అవకాశాలు లేకపోవడం.. వచ్చిన డబ్బులను ఆర్ధికంగా పొదుపు చేయలేక పోవడం వంటివి కులశేఖర్  పతనానికి నాందీ వేసాయని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. 2013లో ఓ గుడిలో దొంగతనం కారణంగా ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. జైలు జీవితం తర్వాత  ఒంటిరితనంతో తీవ్ర మనోవేధన, తెలిసిన వాళ్లు దగ్గర రానీయకకపోవడం వంటివి ఆయన్ని మానసికంగా కృంగదీసాయి. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలగాల్సిన కులశేఖర్.. ఈ  రోజు గాంధీ హాస్పిటల్ ఎవరు లేని అనాథలా చనిపోవడం మనసున్న మనుషుల్ని కలిచి వేసిందనే చెప్పాలి.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News