Mahesh Babu : సిగరెట్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా..?

Mahesh Babu Quits Smoking: ఎలెన్ కార్ రాసిన "ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ " అనే పుస్తకాన్ని చదివిన తర్వాత.. అసలు సిగరెట్ జోలికి వెళ్లలేదట మహేష్ బాబు. ఆ పుస్తకం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, ఇతర మనుషులతో మాట్లాడినప్పుడు కలగని సంతృప్తి పుస్తకాలతో దొరుకుతుందని మహేష్ బాబు తెలిపారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 21, 2024, 01:17 PM IST
Mahesh Babu : సిగరెట్ మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా..?

Mahesh Babu SSM29: మహేష్ బాబు సినిమా జీవితం ఒక తెరిచిన పుస్తకం. అయితే  ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది.కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పడరు.. అందుకే ఆయన కు సంబంధించిన ప్రతి విషయం కూడా హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటుంది.. ఇకపోతే ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమాలో యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్ పైకి వెళ్తుందో మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మహేష్ బాబు.. ఇప్పటివరకు తెలుగు సూపర్ స్టార్ గానే రాణిస్తున్నారు కానీ ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ లేదు. మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు.. అంతేకాదు ఏకంగా గ్లోబల్ మార్కెట్నే టార్గెట్ చేశారు మహేష్ బాబు.. 

ఇక ఈయన వ్యక్తిగత విషయానికొస్తే.. ఈయన పెద్దగా మాట్లాడరు. అంతేకాదు మొదట్లో నమ్రతాకి మహేష్ బాబు విషయంలో ఇదే ఫిర్యాదు కూడా ఉండేది.. ఆ తర్వాత నెమ్మదిగా ఆయనను మారుస్తూ వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు.. ఎక్కడైనా సరే చాలా బాగా మాట్లాడుతారు.. అంతలా ఆయనను మార్చేసింది నమ్రత.. ఈ విషయంలో నమ్రతాకే ఫుల్ క్రెడిట్ అని చెప్పడంలో సందేహం లేదు. 

అయితే ఇక్కడ మహేష్ బాబుకు ఇంకొక అలవాటు కూడా ఉండేదట.. అదే ధూమపానం. కెరియర్ బిగినింగ్ లో ఆయన బాగా సిగరెట్ తాగేవారట..సినిమాల్లో కూడా ఆయన సిగరెట్ తాగే సన్నివేశాలు ఉండేవి. అయితే ఆ అలవాటు ఆయనను ఎంతగానో వెంటాడింది.. మానేయాలని ఎంతో ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు.. ఈ క్రమంలోనే ఒక చిన్న ట్రిక్ ఉపయోగించి సింపుల్గా మానేశారు మహేష్ బాబు. అదేమిటంటే పుస్తకాలు చదవడం. ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతారట అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది సిగరెట్ మానేయాలనుకున్నప్పుడు ఎలా అని పరిశీలించగా..  ఒక పుస్తకం గురించి తెలిసిందట. ఎలెన్ కార్ రాసిన "ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ " అనే పుస్తకాన్ని చదివిన తర్వాత అసలు సిగరెట్ జోలికి వెళ్లలేదట మహేష్ బాబు. ఆ పుస్తకం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, ఇతర మనుషులతో మాట్లాడినప్పుడు కలగని సంతృప్తి పుస్తకాలతో దొరుకుతుందని మహేష్ బాబు తెలిపారు. మొత్తానికైతే ఒక చిన్న పుస్తకం ఆయనను ధూమపానం నుంచి దూరం చేసిందని చెప్పవచ్చు.

Also Readఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News