Sai Dharam Tej Health Condition : నిలకడగా సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం, కాలర్‌ బోన్‌ ఆపరేషన్‌ చేసే అవకాశం

Sai Dharam Tej's collar bone operation : సాయిధరమ్‌తేజ్‌కు డాక్టర్‌ అలోక్‌ రంజన్‌ నేతృత్వంలో ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఛాతీ, కడుపు, కన్ను ప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఇక కాలర్‌ బోన్‌కు ఫ్రాక్చర్‌ కావడంతో శస్త్రచికిత్స నిర్వహించడంపై వైద్యులు ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. వైద్య పరీక్షల ఫలితాలను పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు డాక్టర్లు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2021, 01:01 PM IST
  • సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై సరిగ్గా ఉందన్న వైద్యులు
  • చికిత్సకు ఆయన పూర్తిస్థాయిలో స్పందిస్తున్నారని వెల్లడి
  • బాడీ లోపల ఎలాంటి బ్లీడింగ్ కాలేదన్న డాక్టర్స్
Sai Dharam Tej Health Condition : నిలకడగా సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం, కాలర్‌ బోన్‌ ఆపరేషన్‌ చేసే అవకాశం

Doctors says Actor Sai Dharam Tej's condition is stable : బైక్‌ ప్రమాదంలో గాయపడిన సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. చికిత్సకు ఆయన పూర్తిస్థాయిలో స్పందిస్తున్నారని డాక్టర్స్ తెలిపారు. బాడీ లోపల ఎలాంటి బ్లీడింగ్ కాలేదని వైద్యులు చెప్పారు. సాయిధరమ్‌తేజ్‌కు డాక్టర్‌ అలోక్‌ రంజన్‌ నేతృత్వంలో ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఛాతీ, కడుపు, కన్ను ప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఇక కాలర్‌ బోన్‌కు (collar bone) ఫ్రాక్చర్‌ కావడంతో శస్త్రచికిత్స నిర్వహించడంపై వైద్యులు ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. వైద్య పరీక్షల ఫలితాలను పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు డాక్టర్లు. కాగా సాయి ధరమ్‌ తేజ్‌కి కాలర్ బోన్‌ సర్జరీ చేస్తున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో సర్జరీ పూర్తి చేయనున్నారు. సెడిషన్‌ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి కొద్ది సేప‌ట్లో సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుద‌ల కానుంది. 

Also Read : NEET Exam 2021: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు ఏర్పాట్లు, నిషేధిత వస్తువుల జాబితా ఇదే

ఇక సాయిధరమ్‌తేజ్‌ (Sai Dharam Tej) స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా, అదుపుతప్పి కిందపడి గాయాలయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఐటీ కారిడార్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News