F3 Movie on OTT: ఎఫ్ 3 సినిమా ఓటీటీ హక్కులు ఎవరికి సొంతం ? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

F3 Movie on OTT: లాగ్ వెయిటెడ్ తెలుగు సినిమా ఎఫ్ 3 విడుదలై..నవ్వులు పూయిస్తోంది. ఎ బిగ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోందనే టాక్ విన్పిస్తోంది. అదే సమయంలో ఎఫ్ 3 సినిమా హక్కుల్ని అదిరిపోయే ధరకు ఆ ఓటీటీ వేదిక దక్కించుకుంది. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2022, 08:11 AM IST
  • ఎఫ్ 3 ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక
  • స్టార్ హీరో సినిమాలకు దీటుగా 18 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం
  • ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ విషయంలో ఇంకా రావల్సిన స్పష్టత
F3 Movie on OTT: ఎఫ్ 3 సినిమా ఓటీటీ హక్కులు ఎవరికి సొంతం ? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

F3 Movie on OTT: లాగ్ వెయిటెడ్ తెలుగు సినిమా ఎఫ్ 3 విడుదలై..నవ్వులు పూయిస్తోంది. ఎ బిగ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోందనే టాక్ విన్పిస్తోంది. అదే సమయంలో ఎఫ్ 3 సినిమా హక్కుల్ని అదిరిపోయే ధరకు ఆ ఓటీటీ వేదిక దక్కించుకుంది. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పీర్జాదా నటీనటులుగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 భారీ ఫన్ ఎంటర్‌టైనర్‌‌గా పేరు తెచ్చుకుంది. హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఎఫ్ 2 సినిమాను మించి ఉందని రివ్యూలు పాజిటివ్‌గా వస్తున్నాయి. ఈ సినిమాలో రేచీకటి క్యారెక్టర్‌లో వెంకటేశ్ అదరగొడితే..నత్తి క్యారెక్టర్‌లో వరుణ్ తేజ్ అద్భుతంగా ఎంటర్‌టైన్ చేశాడంటున్నారు. ఎక్కువమంది ఫస్ట్ హాఫ్ అదిరిందని చెబుతున్నారు. సినిమాలోని అన్నిభాగాల్లో ఈవీవీ గుర్తొచ్చారని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంతలా ఎప్పుడూ నవ్వలేదంటున్నారు. 

దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 60 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఎఫ్ 2 సినిమా మొత్తం 80 కోట్ల వరకూ షేర్ వసూలు చేసింది. ఇప్పుడు ఎఫ్ 3 పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లాభాలు కురిపిస్తుందని ఆశిస్తున్నారు. 

ఎఫ్ 3 ఓటీటీ హక్కులు ఎవరికి

ఎఫ్ 3 సినిమా ఓటీటీ హక్కుల విషయంలో డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఎఫ్ 3 సినిమా హక్కుల్ని ఏకంగా 18 కోట్ల రూపాయలకు సోనీ లివ్ దక్కించుకున్నట్టు సమాచారం. అమెజాన్ ప్రైమ్ సైతం ఈ సినిమా కోసం పోటీపడినా..సోనీ లివ్ 18 కోట్లకు చేజిక్కించుకుందని తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటన విడుదల కావల్సి ఉంది. వాస్తవానికి స్టార్ హీరోల సిిమాలకు ఓటీటీ హక్కులు 20-30 కోట్లు పలుకుతుంటాయి. అంటే ఎఫ్ 3 సినిమాకు మంచి డీల్ లభించినట్టేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది ఇంకా స్పష్టత రాలేదు. 

Also read: F3 Movie review and rating: ఎఫ్ 3 బొమ్మ అదిరిందట, ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది. రేటింగ్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News