Good Bye Movie Review: రష్మిక -అమితాబ్ బచ్చన్ 'గుడ్ బై' సినిమా ఎలా ఉందంటే?

Good Bye Movie Review in Telugu: అమితాబ్ బచ్చన్- రష్మిక కాంబినేషన్లో రూపొందిన గుడ్ బై సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉందనేది సినిమా రివ్యూలో చూద్దాం.

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 7, 2022, 12:05 PM IST
Good Bye Movie Review: రష్మిక -అమితాబ్ బచ్చన్ 'గుడ్ బై' సినిమా ఎలా ఉందంటే?

Good Bye Movie Review in Telugu: ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మికా నెమ్మదిగా తెలుగులోనే హీరోయిన్ గా టాప్ ప్లేస్ కు వెళ్లింది. ఇక తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా ఆమె పలు సినిమాల్లో భాగమైంది. అలాంటి సినిమాల్లో గుడ్ బై మూవీ ఒకటి. ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాలో ఆమె భాగమవడంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక హిందీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఈమేరకు ఆకట్టుకుంది? అనేది సినిమా రివ్యూలో చూద్దాం. 
 
‘’గుడ్ బై’’ కథ ఏమిటంటే?
హరీష్ భల్లా (అమితాబ్ బచ్చన్), ఆయన భార్య గాయత్రి (నీనా గుప్తా) వారి నలుగురు పిల్లలతో చండీగఢ్‌లో నివసిస్తూ ఉంటారు. అయితే నలుగురు పిల్లలు తమ చదువు పూర్తయ్యాక దేశ విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతారు. వారిలో ఒకరు తార (రష్మిక మందన్న) ముంబైలో న్యాయవాది. ఇక హరీష్ భల్లా ఇద్దరు కొడుకులు అంగద్ (పావెల్ గులాటి) విదేశాల్లో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలలో పని చేస్తూ ఉంటారు. ఇక చిన్న కొడుకు నకుల్ ఒక పర్వతారోహకుడు. గాయత్రి గుండెపోటుతో చనిపోతుంది. దీంతో పిల్లలందరూ తమ తల్లి చివరి చూపు కోసం చండీగఢ్ చేరుకుంటారు.

అక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. తల్లి చనిపోవడంతో ఆమె అంత్యక్రియల ఆచారాల విషయంలో తండ్రి - కుమార్తె సహా మిగిలిన పిల్లల మధ్య వివాదం ప్రారంభమవుతుంది. మోడ్రన్‌గా ఉండి ఆచార వ్యవహారాలను ప్రశ్నించే కూతురు, తల్లి అంత్యక్రియల తర్వాత విధిగా జుట్టు కత్తిరించుకోవడం కూడా ఇష్టపడని ఓ కొడుకు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబం తిరిగి మళ్లీ కలుస్తుందా? అసలు అంత్యక్రియలు ఎలా చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:
సరిగ్గా తన 80వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు, అమితాబ్ బచ్చన్, హరీష్ భల్లా  పాత్రలో నటించి, తనను బాలీవుడ్ కింగ్ అని ఎందుకు పిలుస్తారో మరోమారు నిరూపించాడు. హరీష్ పాత్రకు అమితాబ్ బచ్చన్ తన ప్రాణం పోశాడు, అలాగే సాధారణంగా ఒక తండ్రి పడే కష్టాలను కూడా బాగా చూపించాడు. గాయత్రి పాత్రలో నీనా గుప్తా కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. ఆమె తెరపై కనిపించినప్పుడల్లా ఆమె బలమైన ఉనికిని చాటుకుంది. అదే సమయంలో రష్మిక మందన్న తార పాత్రకు న్యాయం చేసింది.

ఈ సినిమాలోని అందరు నటీనటుల కంటే సినిమా చూసిన వారితో తార పాత్రతో అత్యంత కనెక్ట్ అయినట్లు భావిస్తారు. ఒకరకంగా బాలీవుడ్‌లో ఇది రష్మికకు ఒక మంచి సినిమా. ఇక టీవీ నటుడు శివిన్ నారంగ్ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. అతని స్క్రీన్ సమయం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అతన్ని ఖచ్చితంగా గమనించే రోల్. ఇక పండిట్‌జీ పాత్రకు సునీల్ గ్రోవర్ పూర్తి న్యాయం చేశాడు. ఎల్లి అవ్రామ్, అభిషేక్ ఖాన్, ఆశిష్ విద్యార్థి తమ పాత్రలను చక్కగా పోషించారు. అరుణ్ బాలి కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. 
 
టెక్నికల్ టీమ్:
గుడ్‌బై సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ గుడ్ బైని ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో వికాస్ బహ్ల్ మార్క్ కనిపించింది. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకుడే కాకుండా రచయిత కూడా, చాలా వరకు రచయితగా ఆయన తన ది బెస్ట్ ఇచ్చారు. ప్రతి భావోద్వేగాన్ని వికాస్ అందంగా చిత్రీకరించాడు. ప్రేక్షకులను కట్టిపడేయడంలో కీలకపాత్ర పోషించే ఈ సినిమాలోని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ తొమ్మిది పాటలు ఉన్నాయి కానీ 'జై కాల్ మహాకాల్' తప్ప మీకు గుర్తుండే పాట మరోటి ఉండదు అని చెప్పచ్చు. ఈ సినిమా షూట్ అంతా డెహ్రాడూన్, రిషికేశ్‌లలో జరిగింది. అయితే ఈ ప్రదేశాల అందాన్ని కూడా చూపించడంలో విఫలమయ్యారు. 
ఇక ఫైనల్ గా:
ఈ గుడ్ బై మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది, కుటుంబంలోని సంబంధాల లోతును చాలా చక్కగా వివరిస్తుంది. జీవితం చాలా చిన్నది అనుకునేలా సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి. సినిమా చూసి ఇంటికి వెళ్లి మీ తల్లిదండ్రులను కౌగిలించుకుంటారనడంలో ఎలండి సందేహం లేదు. సినిమాలో నవ్వు తెప్పించే, కళ్లు చెమ్మగిల్లేలా ఎన్నో సీన్స్ ఉంటాయి. ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా థియేటర్కు వెళ్లి చూసేయండి. 

Rating: 3/5

Also Read: Actress locked in telecom firm: నటిని షోరూంలో లాక్ చేసిన సిబ్బంది... చేయి పట్టుకుని అసభ్య ప్రవర్తన.. కేరళలో షాకింగ్ ఘటన?

Also Read: Arun Bali Passes Away: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సినిమా రిలీజ్ రోజే కన్నుమూసిన సీనియర్ యాక్టర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News