Guidelines To Resume Shootings In Tollywood: కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంయుక్త సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో బుధవారం ఈ సమావేశం జరిగింది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏప్రిల్ నెల నుంచి షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిస్ట్‌లు గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన సినిమాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి షూటింగ్‌లో పాల్గొనాలని, 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించి ఎవరైనా సరే నిలిచిపోయిన సినిమాల షెడ్యూల్స్ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇదివరకే కొంతమేర షూటింగ్ జరుపుకుని, కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కారణంగా మధ్యలో నిలిచిపోయిన సినిమాలు పూర్తయిన తరువాతే కొత్త సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుంటారు. వీటితో పాటు కొన్ని దర్శకాలు సైతం జారీ చేశారు.
Also Read: Mahesh Babus Son Gautam Ghattamaneni: కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఘనతపై నమ్రతా శిరోద్కర్ హర్షం
Guidelines issued by Telugu Film Producers Council, Movie Artist Association and Telugu Film Directors Association to resume shootings. At least 1st Dose of Vaccination is mandatory for all the unit members to be part of film shootings. pic.twitter.com/ahtCi7Leoj
— BARaju's Team (@baraju_SuperHit) June 18, 2021
షూటింగ్‌లలో పాల్గొనే యూనిట్ సభ్యులు కనీసం ఒక్క డోసు కరోనా వ్యాక్సిన్ అయినా తీసుకుని ఉండాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. Tollywood ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్శకాలు విధిగా పాటించాలని నిర్ణయించారు. దర్శకులు, అందుకు సంబంధించిన అన్ని విభాగాలవారు కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల షెడ్యూల్స్ కుదించుకుని, తక్కువ రోజులలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్ చేసే ప్రొడక్షన్ హౌస్ తమ ఆర్టిస్ట్‌ల నుంచి, టెక్నీషియన్ల నుంచి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలని సైతం నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Anasuya latest photos gallery; యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
షూటింగ్‌లకు హాజరయ్యే ప్రతి యూనియన్ సభ్యులు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని, అలా తీసుకున్న వారినే షూటింగ్‌లకు హాజరయ్యే విధంగా చూడాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వారికి లేఖ రాయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి ఏదైనా సలహాలు, సూచనలు గానీ, ఫిర్యాదులను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి వెంటనే తెలియజేయాలని సూచించారు. సభ్యులు ఎం రాందాస్, కెఎల్ దామెదర్ ప్రసాద్, ఎం విజయేందర్ రెడ్డి, సి భరత్ చౌదరి, పల్లి కేశవరావు, వై సురేందర్ రెడ్డి, టి ప్రసన్నకుమార్, పి కిరణ్, వీకే నరేష్, జీవిత రాజశేఖర్ ఈ సమావేశానికి హాజరై షూటింగ్స్ ప్రారంభించడానికి ఈ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook