Teja Sajja: సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మా హీరో గొప్ప అంటే.. కాదు మా హీరో గొప్ప అంటూ.. అభిమానులు నెట్టింట యుద్ధాలు ప్రకటిస్తున్నారు. ఈమధ్య ఆయుధాలు కాస్త సోషల్ మీడియా నుంచి రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులపై ఏకంగా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టేస్తున్నారు. ఇలాంటి వారు మారరు అని నెటిజన్ కు సైతం తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూపర్ డూపర్ హిట్ సాధించిన హనుమాన్ చిత్రంపై స్ప్రెడ్ అవుతున్న నెగిటివిటీ ప్రస్తుతం సోషల్ మీడియాని కుదిపేస్తుంది.
చిన్న సినిమాగా బరిలోకి దిగి స్టార్ హీరోల సినిమాలను సైతం ఢీ కొట్టి సంక్రాంతి సక్సెస్ సాధించిన ఈ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం జరుగుతుంది.
ఎటువంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 350 కోట్లు వసూలు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రాల విఎఫ్ఎక్స్ కు ధీటుగా హై క్వాలిటీ విజువల్స్ ను అందించి.. హనుమాన్ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అలాంటి చిత్రంపై నెగటివ్ ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంత మంచి సినిమాపై ఇలా ఎవరు ప్రచారం చేస్తున్నారు అన్న విషయంపై ఆన్లైన్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. అసలు సంగతి ఏమిటంటే ఈ నెగెటివిటీకి అంతటికి కారణం ఒక హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ అని టాక్. అయితే ఇంకా ఆ హీరో ఎవరు అన్న విషయంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అసలు ఆ హీరో ఎవరు? ఆ హీరోకి హనుమాన్ మూవీ కి ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకని ఆ హీరో ఫ్యాన్స్ హనుమాన్ మూవీ ని టార్గెట్ చేశారు? అనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొన్ని సోషల్ మీడియా పేజీలో మాత్రం గుంటూరు కారం సినిమా.. హనుమాన్ తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవ్వడం వల్ల.. మహేష్ బాబు అభిమానిలే ఇదంతా చేస్తున్నారు అని కామెంట్లు కూడా పెడుతున్నారు.
మరోపక్క తమపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి హనుమాన్ మేకర్స్ అసలు స్పందించడం లేదని టాక్. థియేటర్లో విడుదలయ్యాక తమ సినిమా తన సత్తాని చూపించిందని.. ప్రజల ఆదరణ పొందిన తరువాత.. ఇటువంటి కామెంట్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు భావిస్తున్నట్లు వినికిడి. అంటే ఒక రకంగా కొండను చూసి కుక్క మొరిగితే తప్పేంటి అనుకొని హనుమాన్ టీం సైలెంట్ అయిపోయినట్లు ఉంది. మొత్తానికి ఈ ఆన్లైన్ వాళ్లు ఎప్పుడు ఆగుతాయో అర్థం కావడం లేదు అంటున్నారు నెటిజన్లు.
Also read: Perni Nani: దొంగలు దొంగలు కూడబలుక్కున్నట్టు 'మోదీ, చంద్రబాబు, పవన్' కలయిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook