Harish Shankar Serious at Event: టైగర్ నాగేశ్వరరావు సినిమా తరువాత రవితేజ హీరోగా నటించిన చిత్రం ఈగల్. మాస్ మహారాజా కి వరసగా కొన్ని ఫ్లాపులు రావడంతో తన ఆశయాన్ని ఈ సినిమా పైన పెట్టుకున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రొడ్యూసర్స్ విన్నపాన్ని ఆలకించి ఫైనల్ గా ఫిబ్రవరి 9న థియేటర్స్లోకి వచ్చింది. ఈ చిత్రం మొదటి షో నుంచే పరవాలేదు అనిపించుకుంది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ బాగా రావడంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు ఈ సినిమా మేకర్స్. ఈ నేపథ్యంలో ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
హరీష్ శంకర్ కి రవితేజ కి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన షాక్ సినిమాలో హీరో రవితేజ. ఆ చిత్రం విజయం సాధించినప్పటికీ రవితేజ మరల హరీష్ ని నమ్మి చాన్స్ ఇచ్చి మిరపకాయ లాంటి సూపర్ హిట్ ని అందించారు. ప్రస్తుతం కూడా హరీష్ శంకర్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా ఈగల్ సినిమా సక్సెస్ మీట్ కి హాజరైన హరీష్ శంకర్ రవితేజ సినిమాపై ఒక వెబ్ సైట్ నెగిటివ్ రివ్యూలు రాయడంతో పాటు, మూవీ యూనిట్ ని, డైరెక్టర్ ని పర్సనల్ గా కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉండడంతో.. ఆ సైట్ పైన తీవ్రంగా మంది పడ్డారు. దీనిపై ఆల్రెడీ నిర్మాణ సంస్థ కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఆ సైట్ పై హరీష్ శంకర్ కూడా విరుచుకుపడ్డారు.
నువ్వేమయిన నాకు Peg కలిపావెంట్రా...?
"Save Tigers kadu Save producers."Director @harish2you fires on a Telugu website.#Eagle 🦅 #BlockBusterEagle #EagleBlockBuster #EagleMovie #RaviTeja #indiaglitztelugu pic.twitter.com/vmqqHqFQ4x
— IndiaGlitz Telugu™ (@igtelugu) February 11, 2024
ఈ వెబ్సైట్ గతంలో రాసిన న్యూస్, చేసిన కామెంట్స్ కూడా బయటకి తీసి మరి వాళ్లపైన మంది పడ్డారు. హరీష్ శంకర్ మామూలుగానే ఎవరన్నా ఏదన్నా నెగిటివ్గా రాస్తే కొంచెం ఘాటుగానే స్పందిస్తారు. గతంలో కూడా ఆయన ఇలా స్పందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈసారి మరింత సీరియస్ అయ్యారు ఈ దర్శకుడు. ఎవరు ఆపినా ఆగకుండా చాలా ఆవేశంగా సీరియస్ గా ఆ సైట్ పై ఫైర్ అయ్యాడు. మధ్యలో రవితేజ వచ్చి ఆపాలని చూసిన హరీష్ మాత్రం ఆగలేదు. ‘నువ్వు నాకేమైనా పెగ్గు కలిపావా ? మందు లో ICE వేశావా ?రాసుకో రేపటి నుంచి మళ్లీ ఆర్టికల్స్ నా బొచ్చు కూడా పీకలేవు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ డైరెక్టర్.
Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్ క్రికెటర్
Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్.. ఈ కథ స్ఫూర్తిదాయకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook