Sravana Bhargavi Divorce : ఇద్దరినీ కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఉంది!.. హేమచంద్ర శ్రావణ భార్గవిల విడాకులపై మరోసారి చర్చ

Hema Chandra Sravana Bhargavi Divorce హేమచంద్ర శ్రావణ భార్గవిల విడాకుల రూమర్లు గత కొన్నేళ్ల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. కరోనా సమయంలో ఈ రూమర్లు ఎక్కువగా వచ్చాయి. ఆ మధ్య ఈ ఇద్దరూ వీటిపై పరోక్షంగా స్పందించారు. గానీ విడాకుల రూమర్లను ఖండించలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 11:15 AM IST
  • సోషల్ మీడియాలో సింగర్ల జంటపై చర్చలు
  • రోడ్లపై సింగిల్‌గా హేమచంద్ర రైడింగ్
  • జంటగా చూడాలని అన్న నెటిజన్లు
Sravana Bhargavi Divorce : ఇద్దరినీ కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఉంది!.. హేమచంద్ర శ్రావణ భార్గవిల విడాకులపై మరోసారి చర్చ

Hema Chandra Sravana Bhargavi Divorce టాలీవుడ్ సింగర్ల జంటలో హేమచంద్ర శ్రావణ భార్గవికి మంచి ఇమేజ్ ఉంది. ఈఇద్దరి లవ్ స్టోరీ కూడా అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి పాటలు పాడారు. స్టేజ్ మీద ఈవెంట్లు చేశారు. స్పెషల్ ప్రోగ్రాంలు చేశారు. వీరిద్దరికీ ఓ పాప కూడా ఉంది. అయితే హేమచంద్ర శ్రావణ భార్గవిలు విడిపోయారని, కలిసి ఉండటం లేదని, విడాకులు తీసుకున్నారని రూమర్లు వస్తూనే ఉన్నాయి.

గత ఏడాది ఇదే టైంలో వీరిద్దరి విడాకుల రూమర్లు దావానంలా వ్యాప్తి చెందాయి. కానీ హేమచంద్ర, శ్రావణ భార్గవి నోరు విప్పి ఖండించలేదు. ఒకానొక సందర్భంలో రూమర్లు ఎక్కువ అవ్వడంతో శ్రావణ భార్గవి, హేమచంద్రలు పరోక్షంగా స్పందించారు. మీరు ఇలాంటి రాసి, స్ప్రెడ్ చేయడం వల్ల ఇంకా ఫేమస్ అవుతున్నాం.. గుడ్డో బ్యాడో.. మొత్తానికి మీరు మమ్మల్ని ఫేమస్ చేస్తున్నారు అంటూ శ్రావణ భార్గవి స్పందించింది. కానీ విడాకుల విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

గత ఏడాది శ్రావణ భార్గవి చేసిన పరి అల్బమ్ ఎంతటి కాంట్రవర్సీకి దారి తీసిందో అందరికీ తెలిసిందే. అన్నమాచార్య కీర్తనను ఇలా చిత్రీకరిస్తావా? శృంగార భరితంగా చిత్రీకరిస్తావా? అంటూ శ్రావణ భార్గవి మీద ఫైర్ అయ్యారు. దీంతో విజువల్స్ అలానే ఉంచి.. ట్యూన్‌ను మాత్రం మార్చేసింది శ్రావణ భార్గవి.

 

తాజాగా మరోసారి ఈ ఇద్దరి విడాకుల రూమర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా హేమచంద్ర హెల్మెట్ పెట్టుకుని దుర్గం చెరువు వద్దున్న కేబుల్ బ్రిడ్జ్‌ మీద రైడింగ్‌కు వెళ్లాడు. ఈ వీడియో మీద నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. మీరు శ్రావణ భార్గవి కలిసి వెళ్లండి..మీ ఇద్దరి కలిసి ఉంటే ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఉందంటూ నెటిజన్లు కోరారు. మరి వీటిని హేమచంద్ర చూస్తాడో లేదో చూడాలి.

Also Read:  Allu Arjun Silence on Naatu Naatu : నాటు నాటుకు ఆస్కార్.. రగిలిపోతోన్నాడా?.. నోరు విప్పని అల్లు అర్జున్

Also Read: Chiranjeevi Twitter DP : డీపీ మార్చిన చిరంజీవి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News