Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ పెద్ద విజయాన్ని సాధించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమన్

Kaliyugam Pattanamlo Pre Release Event: కలియుగం పట్టణంలో మూవీ ఈ నెల 29న ఆడియన్స్ ముందుకు రానుండగా.. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. చీఫ్ గెస్టులుగా సీనియర్ హీరో సుమన్, నిర్మాత ఏఎం రత్నం హాజరయ్యారు. సినిమా ప్రేక్షకులు ఆదరించాలని చిత్రబృందం కోరింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2024, 04:42 PM IST
Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ పెద్ద విజయాన్ని సాధించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమన్

Kaliyugam Pattanamlo Pre Release Event: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో సుమన్, నిర్మాత ఏ.ఎం.రత్నం వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు.

Also Read: Force Gurkha 5-door: మహీంద్రా థార్ 5-డోర్‌కు పోటీగా ఫోర్స్ గూర్ఖా 5-డోర్ కారు.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!  

నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను విద్యా వేత్తగా ఇంజనీరింగ్ కాలేజీలను నిర్వహిస్తున్నాను. పిల్లల్లో ఉన్న ప్యాషన్‌కు ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతోనే నాని మూవీ వర్క్స్‌ను స్థాపించాను. నేను ఉన్న, పెరిగిన ఊరుని తెరపై చూపించాలనే కోరిక ఉండేది. రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అయితే బడ్జెట్ మాత్రం ఎక్కువ అవుతుందని డైరెక్టర్ చెప్పారు. అయినా పర్లేదని ముందుకు వచ్చాం. సినిమాలు వద్దు అన్నవాళ్లు కూడా మా టీజర్, ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ మూవీ తరువాత రమాకాంత్‌కు, అలాంటి కొత్త వాళ్లకి చాలా మంది నిర్మాతలు అవకాశం ఇస్తారు. విశ్వ కార్తికేయ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయుషి పటేల్‌కు ఇది మొదటి సినిమా. చూడగానే ఈ పాత్రకు సెట్ అవుతుందని చెప్పాను. కలియుగం పట్టణంలో సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. మార్చి 29న మా చిత్రాన్ని థియేటర్లో అందరూ చూడండి’ అని అన్నారు.

మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా చిత్రం ఇంత త్వరగా పూర్తయి, రిలీజ్‌కు రెడీ అవ్వడానికి ఓబుల్ రెడ్డి కారణం. డైరెక్టర్ రమాకాంత్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ మూవీకి అన్నీ చక్కగా కుదిరాయి. అజయ్ మ్యూజిక్, ఆర్ఆర్ చాలా బాగుంటుంది. చంద్రబోస్ గారి సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. అన్ని పాత్రలు చక్కగా వచ్చాయి. మా సినిమా మార్చి 29న రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

కాటం రమేష్‌ మాట్లాడుతూ.. ‘రమాకాంత్ గారు కథ చెప్పినప్పుడు నేను సినిమాను నిర్మిస్తానని అనుకోలేదు. నాని గారి సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ చక్కగా నటించారు. అజయ్ మంచి ఆర్ఆర్ ఇచ్చారు. మా సినిమా మార్చి 29న రాబోతోంది. అందరూ థియేటర్లోనే వీక్షించండి’ అని అన్నారు.

నిర్మాత ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ.. ‘అందరూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కలియుగం పట్టణంలో టైటిల్ చాలా కొత్తగా ఉంది. చంద్రబోస్ రాసిన కలియుగం కలుషితం అనే పాట బాగుంది. ఆ పాటనే టైటిల్‌గా పెడితే ఇంకా బాగుండేదని అనుకున్నా. కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియెన్స్ ఎలాగూ చూస్తారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
హీరో సుమన్ మాట్లాడుతూ.. ‘విశ్వ కార్తికేయ తండ్రి రామానుజంతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. విశ్వని చిన్నతనం నుంచీ చూస్తున్నాను. విశ్వను ఎంతో చక్కగా పెంచారు. అతను చాలా మంచి వాడు. పెద్దలంటే చాలా గౌరవం. విశ్వ కార్తికేయకు ఈ సినిమాతో చాలా మంచి పేరు రావాలి. నటనలో అతను ఎంతో శిక్షణ తీసుకున్నాడు. నిర్మాత ఓబుల్ రెడ్డి ఈ సినిమాను తన ఊర్లో తీయడం చాలా గొప్ప విషయం. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ రమాకాంత్ చేశారు. అలా చేయడం మామూలు విషయం కాదు. మాటలు, పాటలు అన్నీ బాగున్నాయి. చంద్రబోస్ వంటి వారు ఈ సినిమాకు పాటలు రాయడం గొప్ప విషయం. టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 29న ఈ చిత్రం రాబోతోంది. అందరూ సినిమాను చూసి ఆశీర్వదించండి’ అని అన్నారు.

Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News