Yash New Look: ఎట్టకేలకు గడ్డం తీసేసిన యష్.. రాఖీ భాయ్ నయా లుక్ పోలా అదిరిపోలా!

KGF Chapter 2 Yash Finally Shaves his Beard. ఐదేళ్ల తర్వాత యష్ తన జుట్టు, గడ్డంను కత్తిరించుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 05:44 PM IST
  • ఎట్టకేలకు గడ్డం తీసేసిన యష్
  • రాఖీ భాయ్ నయా లుక్ అదిరిపోలా
  • కేజీఎఫ్ చాప్టర్ 3 కోసమేనా
Yash New Look: ఎట్టకేలకు గడ్డం తీసేసిన యష్.. రాఖీ భాయ్ నయా లుక్ పోలా అదిరిపోలా!

Hero Yash Finally Shaves his Beard for KGF Chapter 3: ప్రస్తుతం కేజీఎఫ్ హవా నడుస్తోంది. గతవారం రిలీజ్ అయిన కేజీఎఫ్ చాప్ట‌ర్‌ 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో వారం రోజుల్లోనే 250 కోట్ల కలెక్షన్లు దాటి.. ఖాన్‌, క‌పూర్‌ల‌ రికార్డులను పక్కకు నెట్టి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌, విజ‌న్‌కు సినీ ప్ర‌ముఖులు సైతం జేజేలు కొట్టారు. ఇక సూపర్ స్టార్ య‌ష్ న‌ట‌న‌, అభిన‌యానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

కేజీఎఫ్ రెండు పార్టులో యష్ పొడవాటి జుట్టు మరియు గుబురు గడ్డం లుక్ ప్రతిఒక్కరికి చాలా నచ్చింది. 'రాకీ భాయ్' పాత్రకు యష్ జుట్టు, గడ్డం సరిగ్గా సెట్ అయ్యాయి. అయితే ఐదేళ్ల తర్వాత యష్ తన జుట్టు, గడ్డంను కత్తిరించుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యష్ తన భార్య రాధికా పండిట్‌తో కలిసి వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఐదేళ్ల తర్వాత తన భర్త గడ్డం చేసుకున్నందుకు రాధికా చాలా సంతోషించారు. 

ముందుగా రాకీ భాయ్ తన గడ్డాన్ని కత్తెరతో కత్తిరించి.. చేతిలో పట్టుకుని కాస్త బాధపడ్డాడు. అనంతరం ట్రిమ్మర్‌తో మరింత గడ్డాన్ని కత్తిరించాడు. ఆ తర్వాత హెయిర్ డ్రస్సర్ యష్ గడ్డాన్ని సెట్ చేశాడు. చివరకు జుట్టు కూడా హెయిర్ కట్ చేసుకుని చాలా అందంగా తయారయ్యాడు. జుట్టు, గడ్డం పోయినందుకు రాకీ భాయ్ బాధపడుతుంటే.. రాధికా పండిట్‌ మాత్రం చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. 

రాకీ భాయ్ నయా లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఫాన్స్ అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సరికొత్త లుక్ కేజీఎఫ్ చాప్టర్ 3 కోసం అని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా భారీ గడ్డం లేకుండా యష్ మాత్రం అద్భుతంగా ఉన్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేజీఎఫ్ చాప్టర్ 2 అతి త్వరలో విడుదల కానుంది. మే 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం మరియు తమిళం వంటి భాషలలో స్ట్రీమింగ్ కానుంది. 

Also Read: Pietersen on Kohli: విరాట్ కోహ్లీ చీకటి ప్రదేశంలో ఉన్నాడు.. ఇది మంచింది కాదు: పీటర్సన్‌

Also Read: నా సతీమణి నీకు పెద్ద ఫ్యాన్.. నిన్ను ప్రేమిస్తుంది! పూజా హెగ్డేపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News