Geethanjali malli Vachindhi: ఏదైనా దేవొషనల్ సినిమా తెరకెక్కించపుడు ఏదైనా ఆలయంలో సినిమా ముహూర్తపు సన్నివేశాలను తెరకెక్కించడం చూసాము. కానీ 'గీతాంజలి' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా టీజర్ లాంఛ్ కోసం ఏకంగా బేగంపేట శ్మశనవాటికను వేదికగా చేసుకోవడం ఇపుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 2014లో అంజలి టైటల్ రోల్లో నటించిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. అంతేకాదు హార్రర్ కామెడీ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇపుడీ మూవీకి సీక్వెల్‌గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాను తెరకెక్కించారు. కథానాయికగా అంజలికి ఇది 50వ చిత్రం కావడం గమనార్హం. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాను హార్రర్ కామెడీ చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 24 బేగంపేటలోని శ్మశాన వాటికలో రాత్రి 7 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. హార్రర్ సినిమా కాబట్టి చిత్ర యూనిట్ కాస్త వెరైటీగా ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఇలా శ్మశనావాటికలో ఇలాంటి ఓ కార్యక్రమం జరగడం ఇదే ఫస్ట్ టైమ్. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. చంద్రముఖి తరహాలో ఉంది. ఇక సౌత్‌లో హార్రర్ కామెడీ చిత్రాలకు ఇది దిక్సూచి వంటిది. ఆ తరవాత ఈ జానర్‌లో ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి.
గీతాంజలి సినిమా స్టోరీ ఎక్కడైతే ఎండ్ కార్డ్ పడిందో.. అక్కడి నుంచే ఈ సినిమా స్టోరీ మొదలు కానుంది. ఈ సినిమాను దక్షిణాదిలో నాలుగు ప్రధాన భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ ఇయర్ జూన్ లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో మలయాళ యాక్టర్ రాహుల్ మాధవ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాను ఎక్కువగా హైదరాబాద్, ఊటీల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, షకలక శంకర్, రవి శంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. గీతాంజలి ఎలా హిట్టైయిందో ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' మూవీ కూడా బంపర్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.
ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పోరేషన్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు. సుజాత సిద్ధార్ధ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ కోన వెంకట్ కథను అందించారు.
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter