Fighter teaser: హాలీవుడ్ రేంజ్‌లో హృతిక్ ‘ఫైటర్' ‌టీజ‌ర్.. గాల్లో హై వోల్టేజ్ యాక్షన్ అదిరింది..

Hrithik Roshan: హృతిక్ రోషన్-దీపికా పదుకొనే జంటగా నటించిన యాక్షన్ మూవీ ఫైటర్. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2023, 12:56 PM IST
Fighter teaser: హాలీవుడ్ రేంజ్‌లో హృతిక్ ‘ఫైటర్' ‌టీజ‌ర్.. గాల్లో హై వోల్టేజ్ యాక్షన్ అదిరింది..

Fighter teaser Out: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) టైటిల్ రోల్ లో నటిస్తున్న మూవీ ఫైటర్(Fighter). సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ ఆడియెన్స్ లో ఎనలేని క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను శుక్రవారం (డిసెంబర్ 8) ఉదయం విడుదలైంది. 

ఫైటర్ టీజర్ చూస్తే చాలు మూవీ ఏ లెవల్లో ఉండబోతుందనేది తెలుస్తోంది. ప్రచార చిత్రం మెుత్తం ఫైటర్ జెట్ విన్యాసాలతో నింపేశారు మేకర్స్. గాల్లో ఫైటర్ జెట్స్ తో హృతిక్, దీపికా చేసిన విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అంతేకాకుండా రొమాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 70 సెకన్ల టీజర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే (జనవరి 25) సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. షారుఖ్ కు పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మూవీపై వీరలెవల్లో అంచనాలు ఉన్నాయి. టీజర్ ఈ విధంగా ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరు ఊహించుకోవచ్చు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News