Saindhav Update: వెంకటేష్ 'సైంధవ్' హార్ట్ ఎవరో తెలుసా?

Saindhav Update: విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా 'సైంధవ్'. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబరు 23న రిలీజ్ కానుంది.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2023, 03:11 PM IST
Saindhav Update: వెంకటేష్ 'సైంధవ్' హార్ట్ ఎవరో తెలుసా?

Venkatesh Saindhav Movie Poster Release: విక్టరీ వెంకటేష్ (Venkatesh) లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సైంధవ్' (Saindhav). శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిక్,  శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని మరో ముఖ్య పాత్రను ‘'హార్ట్‌ ఆఫ్‌ సైంధవ్‌'’ పేరుతో సోమవారం పరిచయం చేశారు మేకర్స్. సినిమాలో కీలకమైన గాయత్రి అనే పాత్రను బేబీ సారా పోషిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ ప్రచార చిత్రంలో వెంకటేష్‌ గాయాలతో కనిపిస్తుండగా.. పాప ఆయన్ని హత్తుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకటేష్‌ పవర్ పుల్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 22న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీనికి సంతోష నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వెంకటేష్ నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ఓటీటీలో బాగానే ఆడినప్పటికీ అతడి క్యారెక్టర్ పై విమర్శలు వచ్చాయి.  ఆయన బూతులు మాట్లాడటం తెలుగు అడియెన్స్ కు పెద్దగా నచ్చలేదు. వెంకీ  సోలోగా నటించి చాలా ఏళ్లే అయింది. ఈ సినిమాతోనైనా భారీ హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read: Indian 2 Update: వామ్మో శంకర్ మామూలోడు కాదు.. ఏకంగా ఆ పాత్రల కోసం సూపర్ టెక్నాలజీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News