Indian 2 Update: ఇట్స్ అఫీషియల్.. క‌మ‌ల్ 'భారతీయుడు 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Indian 2 Update: క‌మ‌ల్ హాస‌న్‌-శంక‌ర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘'భార‌తీయుడు 2'. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో కమల్ చాలా ఇంటెన్షివ్ లుక్ లో కనిపిస్తున్నారు.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 6, 2024, 08:25 PM IST
Indian 2 Update: ఇట్స్ అఫీషియల్.. క‌మ‌ల్ 'భారతీయుడు 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Indian 2 Movie Relase date: యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘'భార‌తీయుడు 2'. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్-కమల్ కాంబోలో గతంలో వచ్చిన భారతీయుడు మూవీ ఎంతో పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడడు భారతీయు 2 రాబోతుంది. 

అందరి అంచనాలను మించేలా డైరెక్ట‌ర్ శంక‌ర్ భార‌తీయుడు 2ను విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దుతున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఈ మూవీని జూన్ నెల‌లో విడుద‌ల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. 

ఈ పోస్టర్ లో క‌మ‌ల్ హాస‌న్ తెల్ల‌టి ధోతి, కుర్తాలో కనిపిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం అంటే ఎంత స్వ‌చ్చంగా ఉండాలో అంత‌టి స్వ‌చ్చ‌త పోస్ట‌ర్‌లో కనిపిస్తుంది. జీరో టాల‌రెన్స్ (త‌ప్పును అస్స‌లు భ‌రించ‌లేను) అని పోస్ట‌ర్‌పై ఉన్న లైన్ చాలా ప్ర‌భావ‌వంతంగా ఉంది. ఇక క‌మ‌ల్ కూడా సీరియ‌స్‌, ఇన్‌టెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. అలాగే మ‌నదేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి క్యాన్స‌ర్‌ను అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఈ పోస్ట‌ర్‌తో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ధూమ‌పానానికి వ్య‌తిరేకంగా చేసిన ప్ర‌క‌ట‌న‌ల నుంచి ప్రేర‌ణ‌తో ఈ పోస్ట‌ర్‌ను త‌యారు చేశారు. ఇది సినిమాపై మ‌రింత క్యూరియాసిటీని పెంచుతోంది.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ రోల్ లో న‌టిస్తోన్న ఈ మూవీలో  సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.

Also Read: Aamna Sharif Hot Pics: హాట్ ఫోటోషూట్ తో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

న‌టీన‌టులు:
క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్:  ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌:  ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, బ్యాన‌ర్స్‌:  లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్‌, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

Also Read: Family Star Day1 Collections: ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ‌విజయ్ దేవరకొండ కెరియర్ లోనే అత్యంత తక్కువ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News