Jabardasth Punch Prasad Gets Emotional జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి, ఆయన అనారోగ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు ఎప్పుడో పాడైపోయాయి. డయాలిసిస్ మీద ఆయన ఇప్పుడు కాలం వెల్లదీస్తున్నాడు. అయితే తన భార్య ఓ కిడ్నీ ఇచ్చేందుకు రెడీగా ఉందని అందరికీ తెలిసిందే. కిడ్నీ ఆపరేషన్ కోసం కూడా నాగబాబు గతంలో అందరి దగ్గరగా ఫండ్ కలెక్ట్ చేశాడనీ తెలిసిందే. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు పంచ్ ప్రసాద్ ఫ్యామిలీ గురించి తెలిసిన మరో విషయం అందరికీ ఏడిపించేస్తోంది.
తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో నవ్వుల పూవులు పూయించారు. బాల్యంలోకి వెళ్తామంటూ రష్మీ, రామ్ ప్రసాద్ వంటి వారు స్కూల్ డ్రెస్‌లో కనిపించారు. ఈ ప్రోమోలో జంబలకిడి జారు మిఠాయా, నువ్వొస్తావని నేను అనే పాటలు పాడిన జానపద గాయకురాల్లని కూడా తీసుకొచ్చారు. ఆ ఎపిసోడ్ బాగానే కలిసి వచ్చేలా ఉంది.
ఇదంతా ఇలా నవ్వుతూ సాగుతూ ఉంది. అయితే ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ ఫ్యామిలీ ఫోటోను చూపించారు. ఇందులో భాగంగా పంచ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. ఫ్యామిలీ అంతా ఉన్న ఏకైక ఫోటో అదే అని, అందులో ఉన్న వారంతా కూడా చనిపోయారని, తన అక్క, అన్న, తండ్రి ఇలా అందరూ చనిపోయారని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు తాను, తన అమ్మ మాత్రమే ఉందని పంచ్ ప్రసాద్ చెబుతూ అందరినీ ఏడిపించేశాడు. మొత్తానికి మొన్నా మధ్య పంచ్ ప్రసాద్ లేవలేని స్థితిలో ఉన్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు మళ్లీ సెట్ అయి.. స్టేజ్ మీద అందరినీ నవ్వించేస్తున్నాడు.
Also Read : Sujatha Rakesh : దుబాయ్‌లో ప్రేమ జంట.. సుజాత రాకేష్ పిక్స్.. జోర్దార్‌గా ఉందే వ్యవహారం
Also Read : prabhas unstoppable episode : అమ్మ ఆహా ప్లానింగ్ ఇదా?.. ప్రభాస్‌ను వాడేస్తున్నారుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి