jabardasth Varsha Hospitalised : ఆస్పత్రి బెడ్డు మీద వర్ష.. కదల్లేని పరిస్థితిలో జబర్దస్త్ బ్యూటీ

jabardasth Varsha Hospitalised జబర్దస్త్ వర్ష తాజాగా ఆస్పత్రిలో చేరింది. ఏమైందో ఏమో తెలియడం లేదు గానీ.. చేతికి సెలైన్ పెట్టినట్టు కనిపిస్తోంది. భుజానికి కూడా ఏదో పెట్టి పరీక్షలు చేసినట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 12:19 PM IST
  • నెట్టింట్లో జబర్దస్త్ బ్యూటీ సందడి
  • ఆస్పత్రి బెడ్డుపై నీరసంగా వర్ష
  • చేతికి సెలైన్ ఉందని చూపించిన బ్యూటీ
jabardasth Varsha Hospitalised : ఆస్పత్రి బెడ్డు మీద వర్ష.. కదల్లేని పరిస్థితిలో జబర్దస్త్ బ్యూటీ

jabardasth Varsha Hospitalised : జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై ఆమెకు మంచి క్రేజ్ ఉంది. సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు నటిస్తూ వచ్చినా కూడా రాని క్రేజ్.. జబర్దస్త్ మూలానా వచ్చింది. జబర్దస్త్ స్టేజ్ మీద అలా బ్లూ చీరలో కనిపించిన వర్ష అప్పటి నుంచి ట్రెండ్ అవుతూనే వచ్చింది. వర్ష అందాలకు అందరూ ఫిదా అయ్యారు. ఇక ఆమె వెరైటీ గొంతు మీద ఎన్ని సెటైర్లు వేసినా, లేడీ గెటప్ అంటూ అందరూ కౌంటర్లు వేసినా కూడా జనాలు మాత్రం ఆమెను ఇష్టపడుతూనే వస్తున్నారు.

వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ ఎప్పుడైతే వర్కౌట్ అయిందో.. అప్పటి నుంచి ఈ ఇద్దరూ బుల్లితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. సుధీర్ రష్మీ రేంజ్‌లో కాకపోయినా కూడా వర్ష ఇమాన్యుయేల్‌ జంటకు కూడా మంచి డిమాండ్ వచ్చింది.ఈ ఇద్దరూ కలిసి ఎన్నో ఈవెంట్లు, పండుగ షోలో నడిపించారు. ఈ ఇద్దరి మీదే ఈవెంట్లు కూడా ప్లాన్ చేసే రేంజ్‌కు వెళ్లారు. 

కానీ వీరి ఓవర్ యాక్షన్ హద్దులు దాటడంతో జనాలు చీ కొట్టేశారు. మధ్యలో కాస్త తగ్గించినట్టు అనిపించినా.. మళ్లీ మొదలుపెట్టేశారు. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల్లో ఈ ఇద్దరూ చేసే హంగామా మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో అయితే జబర్దస్త్ ఫోటోలతో వర్ష అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది.

నగ్నఫోటోలు, అర్దనగ్న ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఫిదా చేస్తుంటుంది. తాజాగా జబర్దస్త్ వర్షకు ఆరోగ్యం బాగా లేదని తెలుస్తోంది. ఆదివారం నాడు ఆరోగ్యం బాగా లేకపోవడం చికెన్ కూడా తినలేకపోయిందట. ట్యాబెట్లు వేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వర్ష ఆస్పత్రి బెడ్డు మీద కనిపించింది.

ఇందులో ఆమె  చేతికి సెలైన్ కనిపిస్తోంది. పైగా ఇంకా ఏదో టెస్టులు కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఆమెకు స్వల్పంగా ఫీవర్ వచ్చిందా? లేదా ఇంకేమైనా సీరియస్‌ అయిందా? అన్నది తెలియడం లేదు. ఆమె అభిమానులు మాత్రం త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.

Also Read : Mega 154 Title Teaser : వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారం.. అదరగొట్టేసిన చిరు  

Also Read : Manchu Vishnu - Prabhas : పెళ్లి చేసుకుంటాడో లేదో గానీ.. ప్రభాస్‌ మీద మంచు విష్ణు సెటైర్లు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News