సాయిధరమ్‌తేజ "జవాన్" విడుదల తేదీ ఖరారు

   

Last Updated : Oct 21, 2017, 02:32 PM IST
సాయిధరమ్‌తేజ "జవాన్" విడుదల తేదీ ఖరారు

సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న "జవాన్" చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా 1 డిసెంబరు 2017 తేదీన విడుదలవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తొలుత ఈ చిత్రాన్ని అక్టోబరులోనే విడుదల చేయాలని భావించారు.

అయితే, కొన్ని సాంకేతిక కారణాల వలన చిత్ర విడుదల వాయిదా పడింది. బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. జవాన్ : ఇంటికొక్కడు అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ సరసన మెహ్రీన్ జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో వస్తున్న  ఈ చిత్రంపై అభిమానులకు, బయ్యర్లకు భారీ అంచానాలే ఉన్నాయి.

సాయిధరమ్‌తేజ్ నటించిన గత చిత్రం "నక్షత్రం" బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాపై భారీ అంచనాలే  ఉన్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. 

Trending News