జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రి అయ్యాడు

నా కుటుంబం మరింత పెద్దదైంది : జూనియర్ ఎన్టీఆర్ 

Last Updated : Jun 14, 2018, 09:31 PM IST
జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రి అయ్యాడు

యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రయ్యాడు. ఎన్టీఆర్‌, ప్రణతిల కుటుంబంలోకి అభయ్ రామ్ తర్వాత మరో వారసుడు వచ్చేశాడు. అవును, ఎన్టీఆర్-ప్రణతి దంపతులకు గురువారం పండంటి మగబిడ్డ జన్మించాడు. ఎన్టీఆర్‌ స్వయంగా తానే ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుని ఆనందం వ్యక్తంచేశారు. 'తనకు కొడుకు పుట్టాడని, రెండో కొడుకు రాకతో తన కుటుంబం మరింత పెద్దదైంది' అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌కి వెంటనే అభిమానుల నుంచి భారీ స్పందన కనిపించింది. ఎన్టీఆర్ ట్విటర్ పేజ్ మొత్తం కంగ్రాట్స్ సందేశాలతో నిండిపోయింది. ఎన్టీఆర్ అన్నయ్య కల్యాణ్ రామ్‌ సహా అతడి కుటుంబసభ్యులు, సన్నిహితమిత్రులు ఎన్టీఆర్‌-ప్రణతి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

తారక్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న అరవింద సమేత సినిమా సెట్స్‌పై ఉంది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రంగస్థలం జిగేలురాణి పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. టెంపర్ సినిమా తర్వాత అరవింద సమేతలో ఎన్టీఆర్ మరోసారి సూపర్ ఫిట్‌నెస్‌తో కనిపించనున్నట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 

Trending News