Jr NTR: మాట తప్పిన జూ.ఎన్టీఆర్.. సినిమా ముందు అలా.. ఇప్పుడు ఇలా.. కౌశిక్ తల్లి కీలక వ్యాఖ్యలు

Kaushik mother about Jr NTR:  ఈ మధ్యనే దేవర చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పడు అంటూ.. తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ తల్లి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తన కొడుకుకు వైద్యానికి అవసరమైన డబ్బులు ఇస్తామని చెప్పారని.. అయితే అసలు ఆ తర్వాత విషయం గురించి పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు.

Written by - Vishnupriya | Last Updated : Dec 23, 2024, 07:58 PM IST
Jr NTR: మాట తప్పిన జూ.ఎన్టీఆర్.. సినిమా ముందు అలా.. ఇప్పుడు ఇలా.. కౌశిక్ తల్లి కీలక వ్యాఖ్యలు

Jr NTR: తిరుపతి ప్రాంతానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కౌశిక్ ఆరోగ్య పరిస్థితి.. గురించి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. తన చికిత్సకు అవసరమైన సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే కౌశిక్ తల్లి సరస్వతమ్మ.. తాజా వ్యాఖ్యలతో ఈ విషయం మళ్లీ చర్చనీయాంశమైంది.  

Add Zee News as a Preferred Source

వీడియో కాల్‌లో కౌశిక్‌కు ధైర్యం చెప్పిన ఎన్టీఆర్, అప్పట్లో త్వరగా కోలుకుని దేవర సినిమా కలిసి చూడాలని కోరారు. అంటే కాదు తాను ఆర్థిక సాయం చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని సరస్వతమ్మ తెలిపారు.  

ఈ క్రమంలో కౌశిక్ కి ఉత్పత్తికి..ఏపీ ప్రభుత్వం రూ.11 లక్షలు, టీటీడీ రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించాయి. వీటికి సరస్వతమ్మ కృతజ్ఞతలు తెలిపారు. కౌశిక్ అభిమానులు రూ.2.5 లక్షల సాయం అందించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.  

ఇక చెన్నై అపోలో ఆస్పత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి అయినప్పటికీ, ఇంకా రూ.20 లక్షల ఆస్పత్రి ఖర్చులు చెల్లించాల్సి ఉందని సరస్వతమ్మ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వాగ్దానం ప్రకారం సాయం అందించాలని ఆమె కోరారు. ‌ఎన్టీఆర్‌కు దగ్గరగా ఉన్న వ్యక్తులను సంప్రదించినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన లభించలేదని.. సరస్వతమ్మ తెలిపారు. చివరిగా, తన కొడుకు ఆరోగ్యంపై దయ చూపి, చికిత్స పూర్తిచేసేందుకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  

కౌశిక్ తన చివరి కోరికగా దేవర సినిమా చూడాలని కోరారు. ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించినప్పటికీ, ఆర్థిక సాయం విషయంలో మాత్రం ఆయన స్పందించలేదని.. ఇక ఇప్పటికైనా ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ముందడుగు వేయాలని కౌశిక్ తల్లి కోరారు.

Also Read: YS Jagan Sharmila: బర్త్ డేకు విష్ చేయని షర్మిల! వైఎస్‌ జగనన్న అంటే అంత కోపమా?

Also Read: YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్‌ షర్మిల ప్రశ్నలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News