Jr NTR at Brahmastram Press Meet: అందరికీ క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. ప్రెజర్ లో ఉన్నామంటూ కామెంట్స్!

Jr NTR Interesting Speech at Brahmastram Hyderabad Press Meet : బ్రహ్మాస్త్రం సినిమా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 3, 2022, 09:02 AM IST
Jr NTR at Brahmastram Press Meet: అందరికీ క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. ప్రెజర్ లో ఉన్నామంటూ కామెంట్స్!

Jr NTR Interesting Speech at Brahmastram Hyderabad Press Meet : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర.  దీనిని తెలుగులో బ్రహ్మాస్త్రం మొదటి భాగం శివ పేరుతో విడుదల చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, టార్లెట్ పిక్చర్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో షారుక్ ఖాన్, అమితాబచ్చన్, నాగార్జున వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కేవలం హిందీలోనే కాక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సెప్టెంబర్ 9వ తేదీన గ్రాండ్గా విడుదలవుతోంది.

ఈ సినిమాని దక్షిణాదిలో రాజమౌళి విడుదల చేస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ రెండో తేదీన హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో ఆ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఆ ప్రెస్ మీట్ లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు క్షమాపణ తెలిపారు. ఎంతో ఆర్భాటంగా ఘనంగా ఒక వేడుక చేయాలనుకున్నాం కానీ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్పడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది అని చెప్పారు.

వాళ్లు కూడా మన సేఫ్టీ కోసమే చెప్పారు కాబట్టి వారి మాటలు బాధ్యత గల పౌరులుగా వినాల్సిన బాధ్యత మనకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అక్కడికి రావాలనుకుని రాలేకపోయిన అభిమానులందరికీ క్షమాపణలు చెబుతున్నానని వారు స్వయంగా ఈవెంట్ కి హాజరు కాకపోయినా మంచి సినిమాలు ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాక ఇప్పుడు థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఆ విషయం మీద పరోక్షంగా స్పందించారు.

సినిమా పరిశ్రమ మొత్తం ఈరోజు తెలియని ప్రెషర్ కి లోనవుతోందని ప్రేక్షకులకు కొత్తగా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అని ఎదురుచూస్తున్నామని చెప్పుకొచ్చారు. తాను వ్యక్తిగతంగా నమ్మే విషయం ఏమిటంటే మేము ఒత్తిడిలో ఉన్నప్పుడే అద్భుతంగా పెర్ఫాం చేస్తామని ఈ ప్రెజర్ బావుందని సినీ పరిశ్రమ మొత్తం ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి మంచి మంచి సినిమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆ ఛాలెంజ్ స్వీకరించి ముందుకు వెళదాం అన్న ఆయన మంచి గొప్ప సినిమాలు మన ప్రేక్షకుల కోసం రూపొందిస్తామని అలాగే ఈ బ్రహ్మాస్త్రం సినిమా కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక బ్రహ్మాస్త్రం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్టీఆర్ సినిమా సక్సెస్ ఫుల్ కావాలని అభిలషించారు. 
Also Read: Charmee Kaur on Karthikeya 2 Success: కార్తికేయ 2 సక్సెస్ ను జీర్ణించుకోలేక పోతున్న ఛార్మీ?

Also Read: Megastar Chiranjeevi's Bad Luck: మెగాస్టార్ చిరంజీవిది ఐరెన్ లెగ్గా.. దారుణంగా ట్రోలింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News