Akira Nandan Watches Kushi : ఖుషీ సినిమాను వీక్షించిన అకీరా నందన్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి

Akira Nandan Watches Kushi అకిరా నందన్ తాజాగా తన తండ్రి నటించిన క్లాసిక్ మూవీని మరోసారి థియేటర్లో చూశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 07:51 PM IST
  • న్యూ ఇయర్ స్పెషల్‌గా ఖుషి
  • రీ రిలీజ్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
  • ప్రత్యేకంగా వీక్షించిన అకిరా నందన్
Akira Nandan Watches Kushi : ఖుషీ సినిమాను వీక్షించిన అకీరా నందన్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి

Akira Nandan Watches Kushi పవర్ స్టార్ అభిమానులకు న్యూ ఇయర్ మాత్రం కాస్త ముందుగానే వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించిన క్లాసిక్ సినిమా ఖుషిని మళ్లీ రిలీజ్ చేయడంతో నిజంగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఖుషి ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా నిలుస్తుంటుంది. అమ్మాయిలకు ఖుషి సినిమా మరీ ఎక్కువగా ఎక్కేస్తుంటుంది. అయితే ఇప్పుడు 21 ఏళ్ల తరువాత మళ్లీ ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేశారు.

దీంతో నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషీ అయ్యారు. ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. ఓ థియేటర్లో అకిరా నందన్ సీక్రెట్‌గా ఈ ఖుషి సినిమాను చూశాడు. కొందరు మాత్రం అకిరా నందన్‌ను గుర్తు పెట్టేశారు. అసలే అకిరా నందన్‌కు సైతం పవన్ కళ్యాణ్‌లా మొహమాటం ఎక్కువ. దీంతో అభిమానులు అరుస్తున్నా కూడా మొహాన్ని చూపించలేదు.

 

హుడీ అడ్డం పెట్టుకుని సినిమాను చూస్తున్నాడు. అలా మొత్తానికి తాను పుట్టక ముందు వచ్చిన సినిమాను ఇలా చూసి అకిరా నందన్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీలైనట్టు కనిపిస్తోంది. అకిరా నందన్ ఫోటోలిప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే రేణూ దేశాయ్ మాత్రం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కూడా బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది.

చూస్తుంటే రేణూ దేశాయ్ ఈసారి పిల్లలను హైద్రాబాద్‌లోనే ఉంచే తాను మాత్రం వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. రేణూ దేశాయ్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఎక్కడ చేసుకోబోతోందన్న సంగతి మాత్రం బయటకు చెప్పలేదు.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News