రజినీకాంత్ పక్కన వున్న వీధి శునకానికి రూ. 2 కోట్ల డిమాండ్

అది ఓ వీధి శునకం. కొద్ది కాలం క్రితం వరకు అన్ని వీధి శునకాల్లో ఒకటిగా తిరిగిన దీనికి ఇప్పుడు వున్నట్టుండి భారీ డిమాండ్ ఏర్పడింది. 

Last Updated : Mar 9, 2018, 08:48 PM IST
రజినీకాంత్ పక్కన వున్న వీధి శునకానికి రూ. 2 కోట్ల డిమాండ్

అది ఓ వీధి శునకం. కొద్ది కాలం క్రితం వరకు అన్ని వీధి శునకాల్లో ఒకటిగా తిరిగిన దీనికి ఇప్పుడు వున్నట్టుండి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంత డిమాండ్ అంటే, అవసరమైతే రూ. 2 కోట్లు వెచ్చించి అయినా సరే ఆ శునకాన్ని సొంతం చేసుకోవడానికి పోటీపడుతున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు. విచిత్రం ఏంటంటే,, అంత డబ్బు పెట్టి కొనేందుకు రజినీకాంత్ అభిమానులు ముందుకొచ్చినా.. ఆ శునకాన్ని అమ్మేందుకు తాను సిద్ధంగా లేనంటున్నాడు ఆ శునకానికి ట్రైనింగ్ ఇచ్చిన యానిమల్ ట్రైనర్  సైమన్.

 

ఇంతకీ ఈ శునకానికి ఇంత భారీ డిమాండ్ ఏర్పడటానికి వెనుకున్న కారణం ఏంటో ఈపాటికే మీకు అర్థమైపోయి వుంటుంది. అవును, రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా సినిమాలో రజినీ పక్కన ఈ శునకానికి కూడా ఓ పాత్ర వుంది. ఈ శునకం పేరు మణి. ఇటీవల రిలీజైన కాలా టీజర్‌లో, సినిమా పోస్టర్లలో ఈ శునకంతో దర్శనం ఇచ్చింది. 

కాలా టీజర్‌లో మణిని చూసినప్పటి నుంచి ఎలాగైనా దానిని సొంతం చేసుకోవాలనేది సూపర్ స్టార్ అంటే పడిచచ్చే అభిమానుల ఆశ. అందుకే సైమన్ కి రూ. 2 కోట్ల వరకు ఆఫర్ చేశారట. కానీ సైమన్ మాత్రం మణిని వదిలేందుకు సిద్ధంగా లేడు. పైగా సైమన్ చెబుతోంది ఏంటంటే.. అది ఓ వీధి శునకం మాత్రమే. ఈ సినిమా కోసం దత్తత తీసుకుని దానికి శిక్షణ అందించాను. అంతకుమించి ఇంకేం ప్రత్యేకతలు లేవని చెబుతున్నాడు సైమన్. 

Trending News