Kadambari Kiran :సినిమాలలో క్యారెక్టర్ల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కాదాంబరి కిరణ్ ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ లో మరింత మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యనే పావలా శ్యామలాకి అలానే కొంతమంది చిన్న నటులకు సహాయం చేసిన ఈయన ఎవరు కష్టంలో ఉన్నామన్నా కానీ నేను సైతం అంటూ ముందుకు వెళ్లి సహాయం చేస్తున్నారు. ‘కష్టానికి చలించటం మానవ సహజం.. పరుల దుఃఖానికి స్పందించటం మానవ సుగుణం.. ఉత్తమమైన మానవ జన్మకి పరమార్ధం.. అనే ఫిలాసఫీని పక్క ఫాలో అయిపోతున్నారు ఈ నటుడు’.
కష్టంలో ఉన్నారు అని తెలియగానే వెతుక్కుంటూ వెళ్లి మరి వాళ్లకు సహాయం చేస్తూ దీనజనబాంధవుడిగా మారారు సినీ నటుడు కాదంబరి కిరణ్. తాజాగా ఒకేసారి పలువురికి ఆర్థిక సాయం చేసి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సినీ నటుడు,‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్ దాతృత్వం కొనసాగిస్తూనే వున్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెయిర్ స్టయిలిస్ట్, సీనియర్ నటి రంగస్థలం లక్ష్మికి ‘మనం సైతం' కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం అందించారు. రంగస్థలం లక్ష్మికి మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేలా సహాయం చేశారు ఈయన. కాగా సినీ ఆర్టిస్ట్, డాన్సర్ చదువులతల్లి సూరేపల్లి చంద్రకళ ఉన్నత చదవుల కోసం ఇంగ్లాండ్ వెళ్లడానికి కొంత సాయం కోరితే మనంసైతం కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు.
అంతేకాదు ఎనుముల విదిష అనే బాలికకు ముక్కుకు సంబంధించిన ఆపరేషన్ కోసం ‘మనం సైతం' కుటుంబం నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం చేశారు. అలాగే ఇటీవల సీనియర్ నటి పావల శ్యామల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని రూ. 25,000 ఆర్థిక సాయం చేసిన కాదంబరి కిరణ్.. మరోసారి ఆమెకు రూ. 6 వేలు అందించారు. ఇలా ఎంతోమందికి సహాయం చేస్తూ.. చెయ్యడానికి సిద్ధంగా నడుస్తూ ఉన్నాడు ఈ నటుడు.
అవసరార్థులకు చేతనైన సాయం కోసం కనకదుర్గమ్మ దయతో ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా.. మనంసైతం సిద్ధంగా ఉంటుందని చెబుతారు కాదంబరి కిరణ్. దీనజనాద్దోరణే "మనంసైతం" కుటుంబం ధ్యేయం, గమ్యం, జీవనం అంటారాయన. మొత్తం పైన కథాంబరి కిరణ్ చేస్తున్న సహాయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉండగా అందరూ ఆయన్ని ఎంతో ప్రశంసిస్తున్నారు.
Also Read: KTR Auto Journey: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపు
Also Read Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook