Kalki 2898 AD Collection: నార్త్, సౌత, ఈస్ట్, వెస్ట్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో ‘కల్కి 2898 AD’ మూవీ బాక్సాఫీస్ దగ్గర కుమ్ముతూనే ఉంది. ముఖ్యంగా భారతీయ బాక్సాఫీస్ కు కీలకమైన హిందీ బెల్ట్ లో ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. అంతేకాదు తొలి రోజు నుంచే అక్కడ హిట్ టాక్ తో రోజు రోజుకు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న సోమవారం కూడా హిందీ బెల్ట్ ఏరియాలో ఈ సినిమా మంచి హోల్డ్ కనపరిచింది. అక్కడ సోమవారం రోజున అక్కడ రూ. 16.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఐదు రోజుల్లో కల్కి సినిమా హిందీ వెర్షన్ మన దేశంలో 128.65 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. అంతేకాదు హిందీలో రూ. 200 కోట్ల వైపు పరుగులు పెడుతుంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నిన్న దాదాపు రూ. 12 కోట్ల షేర్ (రూ. 20 కోట్ల గ్రాస్) వసూళ్లను అందుకున్నట్టు సమాచారం. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సోమవారం రోజున దాదాపు రూ. 25 కోట్ల షేర్ (రూ. 50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 600 కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని రూ. వెయ్యి కోట్ల వైపు పరుగులు పెట్టబోతుంది. తెలుగులో ఇప్పటి వరకు రూ. 130 కోట్ల షేర్ (రూ. 200 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మరో రూ. 40 కోట్ల షేర్ అందుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లో వచ్చే అవకాశాలున్నాయి.
కల్కి సినిమా మొట్ట మొదటగా కేరళలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అక్కడ రూ. 6 కోట్ల బిజినెస్ వాల్యూతో రిలీజైంది. ఇప్పటికే రూ. 6.50 కోట్ల షేర్ (రూ. 12 కోట్ల గ్రాస్) వసూళ్లతో అక్కడ దూసుకుపోతుంది. అంతేకాదు ప్రభాస్ కెరీర్ లో నాల్గవ రూ. 500 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది. బాహుబలి, బాహుబలి 2, సలార్ తర్వాత కల్కి నిలిచింది. అటు బాహుబలి 2, సలార్ తర్వాత మూడవ రూ. 600 కోట్ల సినిమాగా ‘కల్కి 2898 AD’ నిలిచింది. ముందు ముందు కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read more:Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.