Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..

Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా అనే రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా తాజాగా మరో రికార్డును తన పేరిట రాసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 28, 2024, 09:10 AM IST
Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో  అన్ని రికార్డులు ఫసక్..

Kalki 2898 AD Overseas Collections:  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఇప్పటికే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో విధంగా ప్రమోషన్స్ గట్రా లేకుండానే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ మేనియా మాములగా లేదు. పైగా మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన ఈ సినిమాకు యునిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ప్లస్ అయింది. అంతేకాదు ఈ సినిమాకు అన్ని వైపులా మంచి టాక్ రావడంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. అంతేకాదు గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న భారతీయ బాక్సాఫీస్ కు ఈ సినిమా కొత్త ఊపిరులు ఒదిలింది.

ప్రభాస్ కు తోడుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ కూడా యాడ్ కావడం ఈ సినిమాకు మరో ప్లస్ గా మారింది. మొత్తంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్ కటౌట్ తోనే ఈ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయనేది అందరికీ తెలిసిందే. ఇది హీరోగా ప్రభాస్ స్టార్ డమ్ ఏంటో తెలియజేస్తోంది.

ఇదీ చదవండి: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..

ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా $4.5 మిలియన్స్ రాబట్టిన కల్కి మూవీ .. ఫస్ట్ డే ఓవరాల్ గా $5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మన డబ్బుల్లో కనుక లెక్కిస్తే.. దాదాపు రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైమ్ భారతీయ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది. మొత్తంగా మంచి కంటెంట్ తో ప్రభాస్ కటౌట్ ను వాడుకోగలిగితే వసూల్లకు ఢోకా ఉండదని మరోసారి ప్రూవ్ అయింది. ఫస్ట్ డే నే ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన ‘కల్కి 2898 AD’ మూవీకి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ముందు ముందు ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో చూడాలి.

ఇదీ చదవండి: మన దేశంలో వారాహీ అమ్మవారు దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలు ఏమిటంటే.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News