Prabhas Recoreds: యేడాది గ్యాప్ లో ప్రభాస్ సాధించిన ఈ రేర్ రికార్డ్స్ తెలుసా..

Prabhas Recoreds: రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్టు.. కొన్నిసార్లు కటౌట్ చూసి నమ్మేయాలి బ్రో అన్నట్టు.. ఇపుడు ప్రభాస్ తన సినిమాలతో రికార్డులకు మీద సరి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అది కూడా ఒక యేడాది గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 1, 2024, 08:46 AM IST
 Prabhas Recoreds: యేడాది గ్యాప్ లో  ప్రభాస్ సాధించిన ఈ రేర్ రికార్డ్స్ తెలుసా..

Prabhas Recoreds:ప్రభాస్ ప్రస్తుతం తెలుగు సినిమా హీరో కాదు. ప్యాన్ ఇండియా హీరో. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా  ఫస్ట్ డే అలవోకగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే భారతీయ హీరోగా ఎదిగాడు.అంతేకాదు దక్షిణాదిలో వరుసగా ఎక్కువ రూ. 300 కోట్లు.. రూ. 400 కోట్ల గ్రాస్.. రూ. 500 కోట్ల గ్రాస్ అందుకున్న హీరోగా రికార్డులకు ఎక్కారు. లాస్ట్ ఇయర్ ‘ఆదిపురుష్’ వంటి ఫ్లాప్ సినిమాతో రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి.. హీరోగా తన స్టార్ డమ్ ఎలాంటిదో ప్రూవ్ చేసుకున్నాడు.

మరోవైపు ఇయర్ ఎండ్ లో ‘సలార్ పార్ట్ 1 .. సీజ్ ఫైర్’ సినిమాతో రూ. 700 కోట్లు రాబట్టిన హీరోగా రికార్డులకు ఎక్కాడు. తాజాగా కల్కి సినిమాతో ప్రభాస్.. నాల్గు రోజుల్లో రూ. 500 కోట్లు రాబట్టి ఔరా అనిపించాడు. బాహుబలి 2, సలార్ 1 తర్వాత రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ప్రభాస్ మూడో చిత్రంగా కల్కి మూవీ నిలిచింది.   అంతేకాదు ఈ సినిమా ఈజీగా రూ. 1000 కోట్ల గ్రాస్ ను అందుకునే అవకాశాలున్నాయి.

రూ. వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లో ప్రవేశిస్తే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన రెండో చిత్రంగా ఈ సినిమా మరో అరుదైన ఫీట్ అందుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కనుంది. మరోవైపు యేడాదిలో గ్యాప్ లో రూ. 2000 గ్రాస్ వసూళ్లను సాధించిన హీరోగా ప్రభాస్ తన పేరిట మరో రికార్డును క్రియేట్ చేసుకునే అవకాశాలున్నాయి.  అంతేకాదు నార్త్ అమెరికాలో ప్రభాస్ నటించిన 4 చిత్రాలు $8 మిలియన్ క్రాస్ చేసాయి. ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు. ఇక షారుఖ్ ఖాన్.. సినిమాలు 3, అమీర్ ఖాన్ చిత్రాలు 3 మాత్రమే $8 మిలియన్ వసూళ్లను రాబట్టిన చిత్రాలుగా రికార్డులకు ఎక్కాయి. ప్రస్తుతం కల్కి నార్త్ అమెరికాలో $11 మిలియన్ క్రాస్ అయింది. ఒక రకంగా భారతీయ హీరోల్లో ఈ రికార్డు ఏ హీరోలకు లేదు. అంతేకాదు వరుసగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో ప్రవేశించిన హీరోగా ప్రభాస్ పేరిట్ రికార్డు ఉంది.

ఈ సైన్స్ ఫిక్షన్, ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో  ప్రభాస్ భైరవ, కర్ణ అనే రెండు పాత్రల్లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రభాస్ ను ఇప్పటిదాకా చూడని ఇలాంటి కొత్త తరహా పాత్రల్లో చూడటం ప్రేక్షకులకు సరికొత్త గా ఫీలవుతున్నారు. భైరవ క్యారెక్టర్ ను ఫన్, గ్రే, యాక్షన్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన విధానం హీరోయిజంలోనే కొత్త దనం తీసుకొచ్చింది. ఇప్పటికే పురాణ పురుషులైన శ్రీరాముడుగా, కర్ణుడిగా అలరించిన ప్రభాస్.. త్వరలో మహా శివుడిగా ‘కన్నప్ప’లో కనిపించబోతున్నారు.

Also Read: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News