Kalki 2898 AD Trailer: ఆ రికార్డ్ మిస్.. నాలుగో స్థానంలో సరిపెట్టుకున్న ప్రభాస్ సినిమా

Kalki 2898 AD Trailer Record: ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898AD సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని తెగ నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ గురించి ఒక వార్త మాత్రం.  వారిని నిరాశలో మిగిల్చింది..

Written by - Vishnupriya | Last Updated : Jun 11, 2024, 05:02 PM IST
Kalki 2898 AD Trailer: ఆ రికార్డ్ మిస్.. నాలుగో స్థానంలో సరిపెట్టుకున్న ప్రభాస్ సినిమా

Telugu Fastest 1M Likes Trailer:

Add Zee News as a Preferred Source

మహానటి దర్శకుడు నా గ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898AD. అశ్వినీత నిర్మాణంలో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ కూడా మారడంతో…అలానే ఈ సినిమాకి నిర్మాత.. టిడిపి పార్టీకి మద్దటిచ్చిన అశ్వినీ దత్ కావడంతో.స
ఈ చిత్రం టికెట్ రేట్లు కూడా భారీగా పెరిగేలా కనిపిస్తున్నాయి. 

ఈ క్రమంలో ఈ సినిమా జూన్ 27న విడుదల అయ్యి.. రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు. 500 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకి.. రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డులను సైతం పగలకొట్టే సత్తా ఉంది అని.. తెగ ఆనందపడుతున్నారు ప్రభాస్ అభిమానులు. ముఖ్యంగా నిన్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తితోని.. నిజంగానే ఈ చిత్రానికి రికార్డులు బద్దలు కొట్టే సత్తా ఉందని చెప్పకనే చెప్పింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ గురించి ఒక వార్త మాత్రం ప్రభాస్ అభిమానులను కొద్దిగా నిరాశకు గురిచేస్తోంది. సాధారణంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు నటించిన సినిమాల ట్రైలర్ లు రిలీజ్ అయితే.. ఆ ట్రైలర్స్ సాధించే రికార్డుల గురించి తెగ ఎదురు చూస్తుంటారు అభిమానులు. అయితే ఈ రికార్డుల్లో.. ముందుగా అందరూ.. ఎదురుచూసేది..ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ శ్రీకాంత్ కోసం. ఈ లక్ష లైక్స్ ను.. ఎంత త్వరగా తమ ఫేవరెట్ హీరో.. సినిమా ట్రైలర్ అందుకుంది.. అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. 

కాగా లేటెస్ట్ గా వచ్చిన  ప్రభాస్ కల్కి 2898AD ట్రైలర్..రిలీజ్ అయిన తర్వాత.. 1 లక్ష లైక్స్ ను అందుకోవడానికి ఏరు నిమిషాల సమయం తీసుకుంది. దీంతో ఈ ట్రైలర్ .. టాప్ 4 ప్లేస్ తో సరిపెట్టుకుంది. కాగా ఈ వార్త తెలిసి.. ప్రభాస్ అభిమానులు కాస్త ఫీలవుతున్నారు. 

కాగా ఇక్కడ మరో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే.. ఈ రికార్డ్ అందుకున్న తెలుగు సినిమాలలో.. మొదటి స్థానంలో ప్రభాస్ సినిమానే ఉంది. ప్రభాస్ నటించిన సలార్ సినిమా.. మూడు నిమిషాల్లో ఈ రికార్డు అందుకొని.. మొదటి ప్లేస్ లో ఉంది. ఇక ఆ తరువాత నాలుగు నిమిషాల్లో.. ఈ రికార్డు అందుకున్న సినిమాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నిలిచింది. ఇక మూడో ప్లేస్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా నిలవగా.. ఇప్పుడు నాలుగో ప్లేస్ లోకి కల్కి2898AD వచ్చి చేరింది.

అయితే ఈ ఒక్క రికార్డు పోతే పోయింది.. మిగతా రికార్డ్లు అన్నీ మావే అని నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. మరి ఇది నిజమవుతుందో లేదో తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News