'మెర్సెల్' పై కమల్ వ్యాఖ్యలు

Last Updated : Oct 21, 2017, 09:52 AM IST
'మెర్సెల్' పై కమల్ వ్యాఖ్యలు

కోలీవూడ్ స్టార్ విజయ్ నటించిన తమిళ చిత్రం 'మెర్సెల్'పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో వైద్యులు ఈ సినిమాను బహిష్కరించాలని కోరగా బీజేపీ కూడా వారికి మద్దతుగా నిలిచింది. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలపై వ్యాఖ్యలు సరికాదంటూ రాష్ట్రం అంతటా ర్యాలీలు, నిరసన చేపడుతున్నారు. జల్లికట్టు నేపథ్యంలో సాగే 'మెర్సెల్' చిత్రంలో మెడికల్ మాఫియా, డిజిటల్ ఇండియా, జీఎస్టీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినిమాలో ఈ రెండు అంశాలపై అసత్య ప్రచారాలు చేశారని బీజీపీ వాపోయింది. ఈ వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేసింది. 

కాగా, తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఈ చిత్రానికి బాసటగా నిలిచారు. సినిమాను అన్నివిధాలా సెన్సార్ బోర్డు సెన్సార్ చేసిందని, వ్యవస్థలో సరైనరీతిలో విమర్శలు చేయడంలో తప్పులేదని అన్నారు. వివాదాస్పదంగా ఉన్న సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

సుమారు 100 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కించిన 'మెర్సెల్' చిత్రం అక్టోబర్ 18వ తేదీన రిలీజ్ చేశారు. తమిళనాడులో ఈ సినిమా రికార్డులు సృష్టింస్తోంది. కథ, స్రీన్ ప్లే విజయేంద్ర ప్రసాద్. ఎస్. జె. సూర్య, కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ తదితరులు నటిస్తున్నారు. సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, దర్శకుడు- అట్లీ కుమార్. తెలుగులో  'అదిరింది' అనే పేరుతో ఈ చిత్రం విడుదలయ్యింది.

Trending News