Katha Venuka Katha OTT Responce: ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న 'కథ వెనుక కథ’..

Katha Venuka Katha OTT Responce: ఈ మధ్యకాలంలో థియేటర్స్‌లో అంతగా రెస్పాన్స్ రాని సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చకుంటున్నాయి. ఈ కోవలో లాస్ట్ ఇయర్ విడుదలైన 'కథ వెనక కథ' మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు అక్కడ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 6, 2024, 08:37 PM IST
Katha Venuka Katha OTT Responce: ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న  'కథ వెనుక కథ’..

Katha Venuka Katha OTT Responce: సమ్మర్‌లో ఓటీటీలో మంచి సినిమాలకు మంచి  రెస్పాన్స్ ఉంటుంది. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అందులో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు లైక్ చేస్తుంటారు.  హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. అందుకే ఇప్పుడు ఈటీవీ విన్ లో విడుదలైన డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంఇ. విడుదలైన కొద్ది కాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తోంది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'కథ వెనక కథ' సినిమాను డైరెక్ట్ చేశారు.  ప్రముఖ హాస్యనటుడు సునీల్ లీడ్ రోల్లో విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా నటించారు.  శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించారు.  ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన  కృష్ణ చైతన్య వైవిధ్యమైన వివిధ రకాల కథ... కథనాలతో ప్రేక్షకుల్ని కన్నార్పకుండా  థ్రిల్ కు గురిచేశారనే చెప్పొచ్చు.

ముఖ్యంగా క్లైమాక్స్ లో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.  దర్శకుడు అయ్యి... తన మేనమామ కూతురుని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకునే హీరో విశ్వంత్... ఓ అప్ కమింగ్ డైరెక్టర్ నిజజీవితంలో సినిమా ఛాన్సుల కోసం ఎలాంటి కష్టనష్టాలను ఎలా ఎదుర్కొంటారో... అలాంటి హార్డిల్స్ ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు.  అందుకు తగ్గట్టుగానే విశ్వంత్ నటన ఆకట్టుకునే విధంగా ఉంటుందని చెప్పొచ్చు.

 ఆలీ, సత్యం రాజేష్, ఛత్రపతి శేఖర్... ఇలా ఇందులో నటించిన వారంతా తమ శక్తిమేరకు నటించి మెప్పించారనే చెప్పొచ్చు. అలాంటి సినిమాని ఇప్పుడు ఓటీటీలో ఆడియన్స్ ఆదరిస్తున్నందుకు నిర్మాత అవనీంద్రకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాణ విలువలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదన్నారు.  అందుకే ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న మా సినిమాని ఆడియన్స్ అంతలా ఆదరిస్తున్నారన్నారు. ఇది మాకు ఎంతో గొప్ప శక్తి నిచ్చిందన్నారు. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతో కష్టపడటం వల్లే సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందన్నారు.  వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Also Read: Bull Attacks Scooter: వామ్మో.. గంగిరెద్దు ఎంతపనిచేసింది.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News