KBC 13: అమితాబ్​ షోలో కన్నీరు పెట్టుకున్న జాన్ అబ్రహం

బాలీవుడ్​ స్టార్ హీరో జాన్ అబ్రహం.. 'కౌన్ బనేగా కరోడ్​పతి 13' షోలో కన్నీటి పర్యంతమయ్యారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు నిర్వాహకులు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 07:20 PM IST
KBC 13: అమితాబ్​ షోలో కన్నీరు పెట్టుకున్న జాన్ అబ్రహం

KBC 13: జాన్ అబ్రహం, దివ్య ఖోస్లా కుమార్(Divya Khosla Kumar) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సత్యమేవ జయతే 2'.  చిత్ర ప్రమోషన్స్(Satyameva Jayate 2)లో భాగంగా...'కౌన్ బనేగా కరోడ్​పతి 13'లో సందడి చేసింది ఈ జంట. అమితాబ్​ బచ్చన్(Amitabh Bachchan) హోస్ట్ గా చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్​పతి 13' తాజా ప్రోమో రిలీజ్ అయ్యింది. 

ఈ షోలోకి తనదైన స్టైల్​లో ఎంట్రీ ఇచ్చిన జాన్.. సిక్స్​ ప్యాక్​ చూపించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత చేతి వేలిపై ఫుట్​బాల్​ను తిప్పి మెప్పించారు. ఆ తర్వాత 'ధూమ్' సినిమా(Dhoom Movie) అమితాబ్​ ఇంటికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు."నేను బైక్​పై వస్తే.. అభిషేక్​ను మాత్రం ఈ విషయంలో ప్రోత్సాహించవద్దంటూ నాతో అన్నారు. గుర్తుందా! కానీ అభిషేక్​ కిందకు రాగానే 'వావ్ బైక్ చాలా బాగుందని మాట మార్చేశారు అని" జాన్ అబ్రహం(John Abraham) అప్పటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రోమో చివర్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. ఈ ఎపిసోడ్​ శుక్రవారం ప్రసారం కానుంది.

Also Read: Atrangi Re OTT Release: ఓటీటీ విడుదలకు సిద్ధమైన అక్షయ్, ధనుష్ ‘అత్రాంగి రే’

సత్యమేవ జయతే 2 గురువారం థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో జాన్ మూడు రోల్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకి మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. ఇందులో నోరా ఫతేహి(Nora Fatehi) స్పెషల్ సాంగ్ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News