Keerthy Suresh: బరువు వల్ల సినిమా ఛాన్స్ పోగొట్టుకున్న కీర్తి సురేష్.. అప్పట్లో అందుకే కారణం చెప్పలేదట!

Keerthy Suresh Upcoming Movie: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వీలైనంతవరకు జీరో ఫిగర్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది బొద్దుగా ఉన్న క్యూట్ గా ఉంటారు. అలా బొద్దుగా ఉన్న ముద్దుగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్. అయితే ఈ బ్యూటీ తన బరువు వల్ల ఓ మంచి బంపర్ ఆఫర్ పోగొట్టుకుంది అన్న విషయం చాలామందికి తెలియదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2024, 11:32 AM IST
Keerthy Suresh: బరువు వల్ల సినిమా ఛాన్స్ పోగొట్టుకున్న కీర్తి సురేష్.. అప్పట్లో అందుకే కారణం చెప్పలేదట!

Keerthy Suresh Controversy: సౌత్ హీరోయిన్స్ తో పోల్చుకుంటే నార్త్ వాళ్ళు ఎక్కువ గ్లామర్ పై ఫోకస్ చేస్తారు. జిమ్, వర్కౌట్స్ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.  వాళ్లని చూసి మన సౌత్ హీరోయిన్స్ కూడా స్లిమ్ గా ఉండడానికి చూస్తున్నారు. ఇలా ఒకప్పుడు బొద్దుగా ఉండి ఆ తర్వాత విపరీతంగా సన్నబడిపోయిన హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభ దశలో ముద్దుగా బొద్దుగా అందంగా ఉండే కీర్తి ఆ తర్వాత సడన్గా సన్నబడిపోయింది. అయితే ఆమె తన లుక్స్ కారణంగా బాలీవుడ్ లో ఓ మంచి ఆఫర్ మిస్ అయింది.

సౌత్ హీరోయిన్స్ కి హిందీ సినిమాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కొత్తేమీ కాదు. అయితే సౌత్ నుంచి వెళ్లి అక్కడ బాగా క్లిక్ అయిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది. మహానటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తికి కొన్నాళ్ల కిందట హిందీలో ఓ భారీ చిత్రానికి ఆఫర్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా.. బదాయి హో మూవీ ఫేం అమిత్ శర్మ డైరెక్టర్ గా తెరకెక్కుతున్న మైదాన్ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు కన్ఫర్మ్ అయింది.

షూటింగ్ ప్రారంభమయ్యే టైంకి కీర్తి సురేష్ బదులు హీరోయిన్ గా ప్రియమణి ను తీసుకున్నారు. అప్పట్లో మూవీ నుంచి తప్పుకున్నాను అన్నమాట మాత్రమే చెప్పిన కీర్తి అసలు విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇటు చిత్రం బృందం కూడా ఈ విషయం గురించి ఎక్కడా వెల్లడించలేదు. ఈ సమ్మర్  హాలిడే ట్రీట్ గా ఏప్రిల్ 10న మైదాన్ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ అమిత్ శర్మ.. కీర్తిని ఈ మూవీ నుంచి తప్పించడం వెనుక ఉన్న అసలు కారణం గురించి వివరించారు.

ప్రతి చిత్రానికి పాత్రల విషయంలో డైరెక్టర్ కి ఒక ఊహ అనేది ఉంటుంది. సినిమాకి యాక్టర్స్ సెలక్షన్స్ సమయంలో అతను హీరో భార్యగా ఏ రూపాన్ని అయితే ఊహించుకున్నాడో దానికి కీర్తి కరెక్ట్ గా సరిపోయిందట. కానీ తీరా సినిమా ప్రారంభం అయ్యేసరికి కీర్తి చాలా బరువు తగ్గి తన లుక్ పూర్తిగా మార్చుకుంది. మారిన ఈ కొత్త లుక్ తాను రాసుకున్న పాత్రకి సూట్ అవ్వదని ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకున్నట్టు డైరెక్టర్ వెల్లడించారు. 

ఇప్పటివరకు హీరోయిన్లు బరువు పెరగడం వల్ల సినిమాలు కోల్పోవడం చూశాం కానీ ఇలా బరువు తగ్గిన కారణంగా సినిమా కోల్పోవడం చాలా అరుదైన విషయం. నాలుగు సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన మైదాన్ చిత్రం పలు రకాల కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఈ మూవీ హైదరాబాద్ లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు.

Also Read: Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌

Also Read: KCR: నోరు విప్పిన కేసీఆర్‌.. కవిత, అరవింద్‌, హేమంత్‌ అరెస్ట్‌పై తొలి స్పందన ఇదే..

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x