KGF Chapter 2: దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌లకు నోటీసులు

KGF Chapter 2: దక్షిణాది సంచలన సినిమా కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ ఛాప్టర్ 2కు కొత్త సమస్య ఎదురైంది. ఇటీవల విడుదలైన టీజర్ కారణంగా హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌లు నోటీసులు అందుకున్నారు.

Last Updated : Jan 14, 2021, 08:23 PM IST
KGF Chapter 2: దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌లకు నోటీసులు

KGF Chapter 2: దక్షిణాది సంచలన సినిమా కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ ఛాప్టర్ 2కు కొత్త సమస్య ఎదురైంది. ఇటీవల విడుదలైన టీజర్ కారణంగా హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌లు నోటీసులు అందుకున్నారు.

దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిని కూడా ఓ ఊపు ఊపిన సినిమా కేజీఎఫ్ ( KGF ). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన సినిమా సీక్వెల్‌గా కేజీఎఫ్ ఛాప్టర్ 2  ( KGF Chapter 2 ) రూపుదిద్దుకుంటోంది. సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ ( KGF Chapter 2 teaser ) ఇటీవలే విడుదలైంది. విడుదలవుతూనే 125 మిలియన్ల వ్యూస్, 7 మిలియన్ల లైక్స్‌తో కొత్త రికార్డు సాధించింది. ఈ రికార్డుతోనే సినిమాపై ఉన్న అంచనాల్ని అంచనా వేయవచ్చు.  ఇప్పుడీ టీజర్ కారణంగా తలనొప్పులు ఎదురయ్యాయి దర్శకుడు, హీరోలకు.

కర్నాటక యాంటీ టొబాకో సెల్ నోటీసులు పంపింది. దీనికి కారణం టీజర్‌లో హీరో యశ్ ( Hero Yash )..గన్‌తో వాహవాన్ని షూట్ చేసి చివరిగా అదే ఫైర్‌తో సిగరెట్ ముట్టిస్తాడు. అయితే  ఆ సమయంలో నిబంధనల ప్రకారం వేయాల్సిన పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరమనే స్లైడ్ వేయలేదు. దాంతో యాంటీ టొబాకో సెల్ దర్నకుడు ప్రశాంత్ నీల్ ( KGF Director Prashanth neel ), హీరో యశ్‌లకు నోటీసులు పంపింది.

కేజీఎఫ్ ఛాప్టర్ 1 భారీ విజయంతో ఛాప్టర్ 2ను నిర్మాతలు భారీ బడ్జెట్ , తారాగణంతో రూపొందించారు కేజీఎఫ్ ఛాప్టర్ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ( Sanjay Dutt ) విలన్‌గా నటిస్తుండగా..ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ పొలిటిషియన్ పాత్రలో నటిస్తోంది. 

Also read: Vakeel Saab Teaser: వకీల్ సాబ్ టీజర్ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News