Murari Sequel: అదే జరిగితే.. మహేష్ తనయుడితో మురారీ సీక్వెల్.. సీక్రెట్ రివీల్ చేసిన కృష్ణవంశీ..

Mahesh babu son Gautam: దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉంటారు. తాజాగా, ఆయన మురారీ మూవీ రీ రిలీజ్ నేపథ్యంలో.. ఎక్కువగా ఆ సినిమాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన  స్టైల్ లొ రియాక్ట్ అవుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 12, 2024, 10:02 PM IST
  • రచ్చ చేస్తున్న మహేష్ బాబు మురారీ సినిమా..
  • ఇప్పటికీ తగ్గని క్రేజ్..
Murari Sequel: అదే జరిగితే.. మహేష్ తనయుడితో మురారీ సీక్వెల్.. సీక్రెట్ రివీల్ చేసిన  కృష్ణవంశీ..

krishna Vamshi responded on murari movie sequel with Mahesh babu son Gautam: టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ లో ట్రెండ్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పుట్టిన రోజు నేపథ్యంలో మురారీ సినిమాను థియేటర్ లలో మరల విడుదల చేశారు. ఈ మూవీటీమ్ కు ప్రస్తుతం ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని చెప్పుకొవచ్చు. కొన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ అని బోర్డులు సైతం పెడుతున్నారంట. అంతేకాకుండా.. ఈ మూవీకి ఇప్పటికి కూడా  ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పుకోవచ్చు. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా వందరోజులు పూర్తి చేసుకుంది.  

ఇక తాజాగా, ఎక్కడ చూసిన మురారీ సినిమా రీరిలీజ్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం.. కృష్ణవంశీ నెటిజన్ లతో చిట్ చాట్ చేశారు. ఆయన ఎక్స్ వేదికగా ఎల్లప్పుడు కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. దీనిలో భాగంగా ఇటీవల రీలీజ్ అయిన మురారీ సినిమా గురించి, కృష్ణవంశీ తో నెటిజన్లు ఆసక్తిగా మాట్లాడారు. ఈ సినిమాను సీక్వెల్గా మహేబ్ బాబు కుమారుడితో తీస్తారా..అని ఒక నెటిజన్ ప్రశ్నించారు.

దీనికి కృష్ణవంశీ సమాధానంగా.. ఇది మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ లు నిర్ణయించుకొవాలన్నారు. వారు ఇంట్రెస్ట్ చూపిస్తే చూద్దామంటూ కూడా రిప్లై ఇచ్చారు. మరోక నెటిజెన్.. పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు మీరు మూవీ ప్లాన్ చేయలేదా.. అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన.. అనుకున్నామ్.. కానీ జరగలేదని అన్నారు. అంతేకాకుండా.. కొన్నిసార్లు మనం అనుకున్నది జరగదని అన్నారు.

Read more: Liquors shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజుల పాటు అన్నిరకాల లిక్కర్, వైన్ షాపులు బంద్..  

మరోవైపు మురారీ రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో భారీగా వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే దాదాపుగా..7 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు 1 నేనొక్కడినే అనే మూవీలో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు. ఆయన యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కూడా ఇటీవల వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గౌతమ్  కూడా సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. అదే విధంగా ఇటీవల మురారీ సినిమా హల్ లో ఒక జంట పెళ్లి చేసుకొవడం పట్ల మాత్రం.. కృష్ణవంశీ కాస్త ఘాటుగానే స్పందించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News